Actress Trisha: దక్షిణాది సినిమా ఇండస్ట్రీలో అగ్రతారగా గత రెండు దశాబ్దాలుగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న వారిలో నటి త్రిష ఒకరు. ఈమె వరుస సినిమాలలో నటిస్తూ ఒకానొక సమయంలో ఎంతో బిజీ బిజీగా గడిపారు. ఇక ప్రస్తుతం కాస్త అవకాశాలు తగ్గినప్పటికీ ఈమెకు మాత్రం ఎలాంటి క్రేజ్ తగ్గలేదని చెప్పాలి.
ఇకపోతే త్రిష తాజాగా మణిరత్నం దర్శకత్వంలో నటించిన పొన్నియన్ సెల్వన్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం మనకు తెలిసిందే. ఈ సినిమాలో ఈమె కుందవై పాత్ర ద్వారా ప్రేక్షకులను సందడి చేశారు.ఈ ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా త్రిష ఎన్నో వ్యక్తిగత విషయాల గురించి కూడా చర్చలు జరిపారు. అయితే ముఖ్యంగా తన పెళ్లి విషయంపై ఈమె చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
ఈ క్రమంలోనే పెళ్లి గురించి తనని చాలామంది ఎన్నో రకాల ప్రశ్నలు వేస్తుంటారని ఈ ప్రశ్నలు తనకు కొన్నిసార్లు చాలా చిరాకు తెప్పిస్తాయని వెల్లడించారు. పెళ్లి అనేది జీవితంలో ఎంతో ముఖ్యమైన అంశం. పెళ్లి విషయంలో తొందరపడి పెళ్లి అయిన వెంటనే విడాకులు తీసుకోవడం నాకు ఇష్టం లేదు. ప్రస్తుతం నా చుట్టూ ఉన్న వారందరూ కూడా ఇలా పెళ్లి జీవితం పట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తున్న వారే. అందుకే పెళ్లి విషయంలో తాను తొందరపడటం లేదని తెలిపారు.
జీవితంలో ఒక వ్యక్తి నాకు జీవితాంతం తోడుగా ఉంటాడు. అని భావించినప్పుడే తాను పెళ్లి చేసుకుంటానని అలాంటి మిస్టర్ ఫర్ఫెక్ట్ కోసం తాను ఎదురుచూస్తున్నానని ఈ సందర్భంగా త్రిష పెళ్లి గురించి చేసినటువంటి ఈ కామెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరి ఈమెకు ఆ మిస్టర్ ఫర్ఫెక్ట్ ఎప్పుడు దొరుకుతారు ఈమె ఎప్పుడు పెళ్లి చేసుకుంటారనే విషయం తెలియాలంటే వేచి చూడాల్సిందే.
భారత రూపాయి చరిత్రలో ఎన్నడూ లేని స్థాయిలో పతనమవుతోంది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ రోజురోజుకు దిగజారుతూ ఆల్‌టైం…
చలికాలం వచ్చిందంటే చాలు.. చాలా మందికి ఒక విచిత్రమైన అనుభవం ఎదురవుతుంటుంది. కారు డోర్ తీస్తున్నా, కుర్చీలో కూర్చుంటున్నా, కనీసం…
నేటి ఉరుకుల పరుగుల జీవితంలో మానసిక ప్రశాంతతకు, శారీరక దృఢత్వానికి చాలామంది యోగాను ఆశ్రయిస్తున్నారు. అయితే, యోగా చేసేవారిని తరచుగా…
చేపలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయనడంలో సందేహం లేదు. అయితే, చేపలను ఏ ఆహారాలతో కలిపి తింటున్నాం అన్నదే అసలు…
కేంద్రంలోని మోదీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయానికి సిద్ధమవుతోంది. ఇప్పటివరకు అమలులో ఉన్న **మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ…
ప్రపంచం అంతా సోషల్ మీడియాకు బానిసైపోతున్న వేళ… ఆస్ట్రేలియా ఒక చారిత్రక నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ 10 నుంచి అక్కడ…