Varsha Bollamma: తెలుగు ఇండస్ట్రీలో హీరోయిన్గా మంచి గుర్తింపు పొందినటువంటి వారిలో వర్ష బొల్లమ్మ ఒకరు. ఇటీవల కాలంలో ఈమె వరుస సినిమాలో చేస్తూ మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. ఇదిలా ఉండగా తాజాగా ఈమె సందీప్ కిషన్ సరసన నటించిన ఊరి పేరు భైరవకోన అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నారు.
ఈ సినిమా ఫిబ్రవరి 16వ తేదీ ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉంది. ఈ క్రమంలోనే ప్రమోషన్ కార్యక్రమాలను కూడా మొదలుపెట్టారు. ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా వర్ష ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ ఇంటర్వ్యూలో భాగంగా ఈమెకు ప్రేమ పెళ్లి గురించి ప్రశ్నలు ఎదురయ్యాయి. గతంలో ఈమె బెల్లంకొండ గణేష్ తో ప్రేమలో ఉన్నారని త్వరలోనే ప్రేమ వివాహం కూడా చేసుకోబోతున్నారని వార్తలు వచ్చాయి.
ఈ వార్తలపై స్పందించిన ఈమె మేమిద్దరం మంచి ఫ్రెండ్స్ అయితే ఇద్దరు కలిసి ఎక్కడ బయట తిరగలేదు అలాగే సోషల్ మీడియాలో ఒకరి పోస్టులకు ఒకరు కూడా రియాక్ట్ అవ్వడం లేదు. ఇలా బయట తిరుగుతుంటాము అంటే ప్రేమలో ఉన్నామన్న అర్థం ఉంటుంది కానీ ఎక్కడ మేము కనిపించకపోయినా ప్రేమలో ఉన్నామనడంలో అర్థం లేదని తెలిపారు.
పెళ్లి వార్తలను ఖండించిన వర్ష..
ఇలా ఇద్దరు ప్రేమలో ఉన్నామని పెళ్లి కూడా చేసుకోబోతున్నామని వార్తలు రావడంతో ఒక్కసారిగా నేను కూడా షాక్ అయ్యానని ఈ సందర్భంగా వర్ష తెలిపారు. మీరందరూ అనుకున్నట్టు మా ఇద్దరి మధ్య ఏం లేదని ఆయన గుడ్ పర్సన్ మంచి స్నేహితుడు మాత్రమే అంటూ తన ప్రేమ పెళ్లి గురించి వస్తున్నటువంటి వార్తలపై స్పందించి వర్ష క్లారిటీ ఇచ్చారు.
వాతావరణ మార్పులు మన ఆరోగ్యంపై నేరుగా ప్రభావం చూపుతాయని వైద్యులు చెబుతున్నారు. ఒక రోజు ఎండగా ఉండగా, మరుసటి రోజు…
40 ఏళ్ల వయస్సు దాటిన తర్వాత ఆరోగ్యంపై మరింత శ్రద్ధ అవసరమని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఈ దశలో శరీరంలో…
మహిళా రిజర్వేషన్ అమలుకు సంబంధించిన డీలిమిటేషన్ అంశంపై రాజకీయ వాతావరణం మరింత వేడెక్కుతోంది. ఈ విషయంలో ఏపీ సీఎం ఎన్.…
అక్షయ తృతీయ సందర్భంగా కొనుగోళ్లు చేయడం శుభమనే నమ్మకం ప్రజల్లో బలంగా ఉంది. ముఖ్యంగా బంగారం, వెండి కొనడం ఆనవాయితీగా…
పిల్లల్లో ఆటిజం (Autism) సమస్యపై అవగాహన రోజురోజుకు పెరుగుతున్నప్పటికీ, చాలా మంది తల్లిదండ్రులు ప్రారంభ లక్షణాలను గుర్తించడంలో ఆలస్యం చేస్తున్నారు.…
తిరుమల దేవాలయం చుట్టూ ఉన్న మాడ వీధులు భక్తులకు కేవలం మార్గాలే కాదు, ఆధ్యాత్మిక సంప్రదాయానికి ప్రతీకలుగా నిలిచాయి. కలియుగ…