Sharwanand: శర్వానంద్ పరిచయం అవసరం లేని పేరు టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎన్నో సినిమాలలో చిన్న చిన్న పాత్రలలో నటించి అనంతరం హీరోగా అవకాశాలను అందుకున్నటువంటి శర్వానంద్ ప్రస్తుతం హిట్టు ఫ్లాపులతో సంబంధం లేకుండా వరుస సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నారు. ఇలా నటుడిగా ఇండస్ట్రీలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి శర్వానంద్ ఇటీవల పెళ్లి చేసుకుని కొత్త జీవితంలోకి కూడా అడుగు పెట్టారు.
ఇకపోతే శర్వానంద్ తాజాగా మంచు మనోజ్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నటువంటి ఉస్తాద్ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో భాగంగా మనోజ్ శర్వానంద్ ఆస్తుల గురించి చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి శర్వానంద్ టాలీవుడ్ ఇండస్ట్రీలో రిచెస్ట్ హీరోలలో ఒకరు అనే విషయం మనకు తెలిసిందే. ఈయనకు తన తండ్రి తాతల నుంచి భారీ స్థాయిలో ఆస్తులు వచ్చాయట.
ఇలా హైదరాబాదులో భారీ స్థాయిలో వీరికి లాండ్స్ ఉన్నాయని కూడా తెలుస్తుంది .ఇక ఈ విషయం గురించి మనోజ్ ప్రశ్నిస్తూ నీ లైఫ్ లో నీకు ఉస్తాద్ ఎవరు అంటూ ప్రశ్నించడంతో మా తాత అంటూ శర్వానంద్ సమాధానం చెప్పారు.దీంతో మనోజ్ వెంటనే ఎందుకు ఆస్తులు ఇచ్చారన అంటూ సెటైర్ వేశారు.
చరణ్ స్నేహితుడు కావడం అదృష్టం…
ఇక రాంచరణ్ చిరంజీవితో కలిసి ఉన్నటువంటి ఫోటోలను మనోజ్ ఈ కార్యక్రమంలో చూపించగా రామ్ చరణ్ గురించి శర్వానంద్ మాట్లాడినటువంటి వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. వీరిద్దరూ చాలా మంచి స్నేహితులు అనే విషయం మనకు తెలిసిందే ఈ విషయం గురించి శర్వానంద్ మాట్లాడుతూ నిజంగా రాంచరణ్ లాంటి స్నేహితుడు నాకు దొరకడం నేను చేసుకున్నటువంటి అదృష్టం అంటూ ఈ ఫోటోలపై శర్వానంద్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…