Yamuna Home Tour: మరో హోం టూర్ చేసిన నటి యమున..! నెటిజన్లు ఏమంటున్నారంటే..!
Yamuna Home Tour: నటి యమున.. ఆమె పేరు తెలియని వారుండరు. ఎన్నో సినిమాల్లో హీరోయిన్ గా నటించి… గ్లామర్ డోస్ లో తనకు తిరుగులేదు అని నిరూపించుకుంది. ఇలా వెండితెర ఆడియన్స్ కు ఈమె సుపరిచితురాలు. ఇక గత కొంతకాలం నుంచి వెండితెర నుంచి బుల్లితెరపై అడుగు పెట్టింది.
ఈటీవీలో ప్రసారం అవుతున్న సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు అనే సీరియల్లో ఆమె మెయిన్ పాత్రలో కొనసాగుతోంది. ఇలా పలు సీరిలళ్లలో నటిస్తూ.. బుల్లితెరపై కూడా తనకు సాటి లేదని నిరూపించుకుంది.
ఇలా ఆమె ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్ లో బుల్లితెరపై స్థిరపడిపోయింది. ఒక్క సీరియళ్లలోనే కాదు.. సోషల్ మీడియాలో కూడా యమున యాక్టీవ్ గా ఉంటుంన్నారు. ఈ మధ్య హోమ్ టూర్ చేసిన యమున వీడియోను దాదాపు మిలియన్స్ కు పైగా వీక్షించారు.
ఆ వీడియోకు విపరీతమైన డిమాండ్ రావడంతతో.. మరో వీడియోను పోస్టు చేశారు. అది కూడా మళ్లీ హోమ్ టూర్ తో ముందుకు వచ్చింది. బుల్లితెరపై బిజీగా ఉన్న తాను .. భవిష్యత్తులో విశ్రాంతి తీసుకోవాల్సి వచ్చినప్పుడు ప్రశాంతంగా గడిపేందుకు వీలుగా ఆమె హైదరాబాద్ ఔట్ కట్స్ లో ఓ స్థలాన్ని తీసుకున్నారు. ఇలా సిటీకి దూరంగా ఉన్న ఈ స్థలాన్ని కొని.. అందులో ఆమెకు నచ్చిన విధంగా ఇంటిని నిర్మించుకున్నారు. మహేశ్వరంలో ఉన్న తన 360 గజాల స్థలంలో ఆమె ఇంటిని నిర్మించుకున్నారు. ఇక అందులో ఉన్న పూజాగది, కిచెన్ గది, హౌస్ మొత్తాన్ని వీడియో తీసి.. మీ యమున అనే యూట్యూబ్ ఛానల్ లో పోస్టు చేశారు. మొదటి హోమ్ టూర్ చేసి నెల రోజులు కూడా కాకముందే మళ్లీ ఇలా మరో హోమ్ టూర్ చేశారు యమున. ఇక ఈ ఇంటిని చూసిన నెటిజన్లు ఇల్లు చాలా బాగుంది అంటూ మెచ్చుకుంటున్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో నైరుతి రుతుపవనాలు క్రమంగా బలపడుతున్నాయి. రాష్ట్రంలోని మరిన్ని ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరించడంతో వాతావరణ పరిస్థితుల్లో స్పష్టమైన మార్పులు కనిపిస్తున్నాయి.…
తమిళ సినీ పరిశ్రమలో స్టార్ హీరోగా, ప్రస్తుతం రాజకీయ నాయకుడిగా కొనసాగుతున్న విజయ్ పేరు మరోసారి వార్తల్లో నిలిచింది. అయితే…
భారత క్రికెట్‌లో కొత్త తరానికి చెందిన యువ ప్రతిభలు వరుసగా వెలుగులోకి వస్తున్నాయి. అందులో ముఖ్యంగా సూర్యవంశీ కుటుంబం పేరు…
నల్లగొండ జిల్లాలో స్నేహం అనే బంధాన్ని ప్రశ్నార్థకంగా మార్చే ఘటన వెలుగులోకి వచ్చింది. కొంతకాలంగా స్నేహితులుగా కలిసి తిరుగుతున్న ఇద్దరు…
ప్రపంచంలో అత్యంత ధనవంతుల జాబితా గురించి చర్చ వచ్చినప్పుడల్లా ముందుగా వినిపించే పేరు ఎలాన్ మస్క్. సాంకేతిక రంగం, అంతరిక్ష…
హైదరాబాద్‌లో చెరువుల పరిరక్షణ, ప్రభుత్వ భూముల సంరక్షణ, అక్రమ నిర్మాణాల తొలగింపు వంటి చర్యలతో తరచూ వార్తల్లో నిలిచే హైడ్రా…