Shanmukh-Deepthi: వాళ్లిద్దరు త్వరలోనే కలుస్తారు..! షణ్ముఖ్ తండ్రి సంచలన వ్యాఖ్యలు..!
Shanmukh-Deepthi: బిగ్ బాస్ కు వెళ్లి వచ్చిన తర్వాత ఎక్కువగా ఇబ్బంది పడుతున్నారు షణ్ముఖ్ అతడి ప్రేయసి దీప్తి సునయనా. వీరిద్దరు సోషల్ మీడియా స్టార్స్. ఫేమస్ లవ్ కపుల్స్ కూడా. వీళ్ళిద్దరూ గత 5 సంవత్సరాల నుంచి రిలేషన్ లో ఉన్నారు. సోషల్ మీడియాలో, టీవీ షోలలో చాలా సార్లు వాళ్ళ ప్రేమ గురించి చెప్పారు.
ఎన్నో షార్ట్ ఫిలిమ్స్, కవర్ సాంగ్స్ లోనూ నటించారు.
ఇక ఇటీవల బిగ్ బాస్ షోలో సిరి, షణ్ముఖ్ సాగించిన వ్యవహారంతో బయటకు ఎక్కువగా ఎఫెక్ట్ అయింది మాత్రం షణ్ముఖ్ అనే చెప్పాలి. ఇలా దీప్తి సునయనా కూడా.. షణ్ముఖ్ తో బ్రేకప్ చెబుతున్నట్లు సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. దీనికి రిప్లై గా తాను హ్యాపీగా ఉండాలి అని బాధతో షణ్ముఖ్ కూడా పోస్ట్ చేశాడు. అయితే అప్పుడే షన్నుకి విడిపోవడం ఇష్టం లేదని, దీప్తినే బ్రేకప్ చెప్పిందని వార్తలు వచ్చాయి.
ప్రస్తుతం కూడా అదే జరుగుతోంది. ఇటీవల దీప్తి సునయనా బర్త్ డే సందర్భగా షణ్ముక్ ఓ పోస్ట్ చేశాడు. విష్ చేసినా.. దీప్తి ఎలాంటి రిప్లై ఇవ్వలేదు.. ఎలాంటి సమాధానం ఇవ్వలేదు. దీప్తి సునయనా దాదాపు షణ్ముక్ కు సంబంధించిన అన్ని జ్ఞాపకాలను చెరిపేసింది.
తాజాగా దీనిపై షణ్ముఖ్ తండ్రి స్పందించాడు. ఓ ఇంటర్వ్యూలో ఈ విషయంపై మాట్లాడుతూ.. వాళ్లిద్దరు కలిసే ఉంటారని.. బ్రేకప్ చెప్పింది కేవలం దీప్తి మాత్రమే అని.. షణ్ముఖ్ చెప్పలేదు కదా అంటూ చెప్పాడు. వాళ్లిద్దరి వ్యక్తిగత విషయాల గురించి మనం ఎక్కువగా చర్చించకూడదు. కాకపోతే ఆ అమ్మాయికి ఏం అనిపించిందో తెలీదు కానీ సోషల్ మీడియాలో అలా పోస్ట్ పెట్టింది. ఇక వాళ్లు కలవడానికి కాస్త సమయం పడుతుంది అంటూ చెప్పాడు. ఇది రెండు కుటుంబాలకు సంబంధించిన విషయం. దీనిపై అభిమానులు అనుమానించాల్సిన అవసరం లేదని చెప్పాడు. దీంతో షణ్ముఖ్, దీప్తి అభిమానులు దీనిపై సంతోషం వ్యక్తం చేస్తున్నారు. త్వరలో వాళ్లిద్దరు కలవాలని కోరుకుంటున్నారు.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…