Adavi Shesh : ‘కర్మ’ సినిమాతో తొలిసారి తెలుగు ఇండస్ట్రీకి వచ్చిన అడవి శేష్ మొదట పదిహేను ఏళ్ల వయసులో తొలిసారి సొంతం సినిమాలో నటించాడు. ఇక డైరెక్టర్ గానూ రైటర్ గానూ తన సినిమా కథలను తానే మలుచుకునే అడవి శేష్ గూడాచారి, క్షణం, మేజర్ వంటి చిత్రాలతో హిట్లని మాత్రమే కాకుండా అభిమానులను కూడా పెంచుకున్నాడు. ప్రస్తుతం హిట్ సినిమా సీక్వెల్ లో నటిస్తున్న అడవి శేష్ ఈ సినిమాను అన్ని భాషలలోను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇక తన కెరీర్ గురించి పలు ఆసక్తికర విషయాలను పంచుకున్న అడవి శేష్ తాను మొదట చేసిన సినిమా సొంతం గురించి షాకింగ కామెంట్స్ చేసారు.
సొంతం సినిమా ఇప్పటికీ చూడలేదు… ఆ విషయంలో హర్ట్ అయ్యాను…
పుట్టింది హైదరాబాద్ లోనే అయినా అమెరికా లో పెరిగిన అడవి శేష్ మొదట తనకు పదిహేను ఏళ్ళు ఉన్నపుడు సినిమాలో నటించాడు. అదికూడా తెలుగు సినిమాలో కనిపించాడు. శీను వైట్ల డైరెక్షన్ లో వచ్చిన ‘సొంతం’ సినిమా, ఆ సినిమాలో నమిత ను పెళ్లి చేసుకోడానికి వచ్చే ఫారిన్ పెళ్లి కొడుకుగా అడవి శేష్ ఒక సీన్ లో అలా కనిపిస్తాడు. అయితే సినిమాకు తీసుకున్నపుడు మాత్రం తనది వన్ ఆఫ్ ది హీరో రోల్ అని హిందీ సినిమా ‘దిల్ చాహతా హై’ లాంటి స్టోరీ అని చెప్పారట.
ముగ్గురు హీరోలు ఉంటారు అంటూ చెప్పి తీరా చూస్తే మూడు రోజుల్లో సీన్ షూట్ చేసి పంపారు. దాంతో బాగా హర్ట్ అయ్యాను, అందుకే ఇప్పటికీ ఆ సినిమా చూడలేదు అంటూ ఓపెన్ గా చెప్పేసాడు. అయినా శీను వైట్ల ఒకప్పుడు స్టార్ డైరెక్టర్ ఇప్పుడు కాదు కాబట్టి ఓపెన్ గా చెప్పాడు కానీ అదే ఇప్పుడు కూడా మంచి స్టేజిలో శీను వైట్ల ఉండి ఉంటే ఇలానే చెప్పేవాడా అంటూ నెటిజన్స్ అనుకుంటున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…