Samantha : తెలుగులో హీరోయిన్ గా అగ్ర స్థానంలో ఉన్న సమంత నాగచైతన్య తో వివాహం జరిగి అక్కినేని కుటుంబానికి కోడలిగా వెళ్లినాకూడా సినిమాలను చేస్తూ తనని తాను ఛాలెంజింగ్ పాత్రలతో నిరూపించుకుంటూ వచ్చింది. అయితే ఇద్దరూ విడిపోయి విడాకులు తీసుకుని దూరంగా ఉంటున్నా ఎవరి కెరీర్ లో వాళ్ళు బిజీగా ఉన్నారు. విడాకుల తరువాత సమంత కెరీర్ స్లో అవుతుందని అనుకున్నా ఆమె మాత్రం రెట్టింపు స్పీడ్ తో దూసుకెళ్ళింది. ఒకవైపు పాన్ ఇండియా సినిమాలు చేస్తూ మార్కెట్ పెంచుకుంది. ఇక అంతా బాగుందనుకునే లోపే సమంతకు ఆటో ఇమ్మ్యూన్ సమస్యతో బాధపడుతున్నట్లు స్వయంగా తానే ప్రకటించడంతో ఒక్కసారిగా ఆమె అభిమానులు షాక్ అయ్యారు. అయితే సమంత తాజాగా యశోద సినిమా ప్రమోషన్స్ కోసం సుమ తో ఇంటర్వ్యూలో పాల్గొంది. అందులో చాలా ఎమోషనల్ గా తన వ్యాధి గురించి మాట్లాడుతూ కన్నీరు పెట్టుకోవడం ఇదంతా బాగా వైరల్ అయింది. ఇక ప్రస్తుతం చికిత్స తీసుకుంటున్న సమంత ఆరోగ్యం పై రోజుకో కథనం మీడియాలో ప్రత్యక్షం అవుతోంది. దీంతో ఆమె సన్నిహితులు అలాగే అభిమానులు ఆందోళన చెందుతున్నారు.
సౌత్ కొరియా వెళ్లిన సమంత…
సమంత మయోసిటీస్ అనే అరుదైన వ్యాధితో బాధపడుతోంది. ఇక చికిత్స కోసం ఇప్పటికే అమెరికా వెళ్లొచ్చిన సమంత అక్కడ పూర్తిగా నయం కాదని తెలిసీ ఇండియా తిరిగి వచ్చేసింది. ఇక సన్నిహితుల సూచణ మేరకు కేరళ ఆయుర్వేద చికిత్స తీసుకున్నట్లు సమాచారం. ఇక ఇప్పుడు తాజాగా సమంత చికిత్స కోసం సౌత్ కొరియా వెళ్లిందంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఇక వీటి గురించి సమంత మేనేజర్ స్పందించారు. ఎవరికి తోచినట్లు వాళ్ళు వార్తలు రాస్తున్నారు.
సమంత ఎక్కడికీ వెళ్ళలేదు తన ఇంట్లో ఉండి రెస్ట్ తీసుకుంటోంది. తాను ఏ చికిత్స తీసుకోవడం లేదు అంటూ క్లారిటీ ఇచ్చారు. అయితే ఈ మధ్య కాలంలో సమంత ఆరోగ్యం గురించి తమిళ మీడియా అనేక కథనాలను ప్రచురించడంతో అభిమానులు, ఆమె సన్నిహితులు ఆందోళనకు గురవుతున్న నేపథ్యంలో సమంత కు చెందిన పర్సనల్ మేనేజర్ ఒక ప్రకటనలో ఆమె ఆరోగ్యం గురించి క్లారిటీ ఇచ్చారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…