Featured

Adavi Simhalu : ఆ సంవత్సరంలో బాక్సాఫీస్ వద్ద గాండ్రించిన అడవిసింహాలు.. సూపర్ స్టార్, రెబల్ స్టార్ ల బ్లాక్ బస్టర్.!!

Adavi Simhalu : దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు 1977లో ఆయన దశ దిశ మారిందనే చెప్పాలి. తృటిలో తప్పి పోయే అవకాశాన్ని అందిపుచ్చుకున్నారు. తనకిచ్చిన అవకాశంతో సత్యచిత్ర బ్యానర్ లో “అడవిరాముడు” చిత్రాన్ని ఎన్టీరామారావుతో తీసి విజయ దుందుభి మోగించారు. ఆ తరువాత రాఘవేంద్ర రావు, సూపర్ స్టార్ కృష్ణ తో అనేక చిత్రాలు రూపొందించారు. అదేవిధంగా రెబల్ స్టార్ తో కూడా అద్భుత విజయాలను దర్శకేంద్రుడు సొంతం చేసుకున్నారు.

ఇకపోతే 1974లో స్థాపించిన వైజయంతి మూవీస్.. “ఎదురులేనిమనిషి” చిత్రంతో సినీ గమనాన్ని ప్రారంభించింది. వైజయంతి మూవీస్ అధినేత అశ్వినీదత్ అనతికాలంలోనే ఎన్టీఆర్ ఏఎన్నార్ కృష్ణంరాజు కృష్ణ, శోభన్ బాబు, చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున లాంటి హీరోలతో అనేక చిత్రాలను రూపొందించారు. అలా దర్శకుడు రాఘవేంద్రరావు మొదటిసారిగా ఈ సినిమాతో వైజయంతి మూవీస్ బ్యానర్ లో పనిచేయడం జరిగింది. అదే సంవత్సరంలో కృష్ణ దాదాపు నాలుగు మల్టీస్టారర్ చిత్రాల్లో నటించారు. అలా రాఘవేంద్ర రావు సూపర్ స్టార్ రెబల్ స్టార్ లతో ఒక చిత్రాన్ని రూపొందించారు. ఈ చిత్రానికంటే ముందే 1978 మల్లికార్జునరావు దర్శకత్వంలో “మనుషులు చేసిన దొంగలు” అనే చిత్రంలో సూపర్ స్టార్ కృష్ణ, రెబల్ స్టార్ కృష్ణంరాజు కలిసి నటించారు. ఆ తర్వాత తిరిగి అడవి సింహాలు చిత్రంలో నటించారు.

“అడవి సింహాలు” 1983 తెలుగు యాక్షన్ చిత్రం, దీనిని వైజయంతి మూవీస్ నిర్మాణ సంస్థపై సి.అశ్వినిదత్ నిర్మించాడు. కె. రాఘవేంద్రరావు దర్శకత్వం వహించాడు. సినీ తారలు కృష్ణ, కృష్ణంరాజు, జయప్రద, శ్రీదేవి ప్రధాన పాత్రలుగా నటించిన ఈ చిత్రానికి చక్రవర్తి సంగీతాన్నందించాడు. ఈ చిత్రం ఏకకాలంలో హిందీలో “జానీ దోస్త్ “గా విడుదలైంది. ఈ హిందీ చిత్రంలో ధర్మేంద్ర, జీతేంద్ర, శ్రీదేవి, పర్వీన్ బాబీలు కీలక పాత్రల్లో నటించారు. రెండు సినిమాలు ఒకే బ్యానర్, ఒకే దర్శకుడిచే ఒకేసారి నిర్మించబడ్డాయి, కొన్ని సన్నివేశాలు, కళాకారులు రెండు వెర్షన్లలో ప్రతిరూపంగా నిలిచారు… అయితే ఈ సినిమాలో కృష్ణ కృష్ణంరాజు స్నేహితులుగా కొనసాగుతారు. గిరిజనుల అటవీ సంపదను దోచుకునే ముఠాను అడ్డుకునే ప్రయత్నమే ఈ సినిమా కథ.

కృష్ణ సరసన శ్రీదేవి నటించగా కృష్ణంరాజు సరసన జయప్రద నటించారు. ఈ సినిమా షూటింగ్ మద్రాస్, మధుమలై, విశాఖపట్నంలో కొనసాగింది. వైజాగ్ సమీపంలో గల భీమిలి ప్రాంతంలో రెండు లక్షల రూపాయలు వెచ్చించి కోయగూడెం సెట్ వేయించారు. దాదాపు 30 అడుగుల ఎత్తుతో అడవితల్లి విగ్రహం ఏర్పాటు చేశారు. ఇందులో “అడవిసింహాలు” చిత్రంలోని కీలక సన్నివేశాలు చిత్రీకరించారు. భారీ సినిమాలు నిర్మించే వైజయంతి మూవీస్ ఈ సినిమా నిర్మాణంలో ఏ మాత్రం వెనుకంజ వేయలేదు. సినిమా షూటింగ్ లో లారీ వాహన ఉపయోగం ఎక్కువగా ఉండడంతో అద్దెకు తీసుకోకుండా అశ్వినిదత్ ఒక కొత్త లారీని కొనుగోలు చేయడం జరిగింది. ఆ తర్వాత “నూల్” అనే మరో తార ఇందులో నటించారు. నూలు అంటే మరో హాలీవుడ్ హీరోయిన్ కాదు. అచ్చంగా తొమ్మిదేళ్ళ “చింపాంజీ”. దీనిని అమెరికా నుంచి అద్దెకు తెప్పించారు. ఈ చిత్రంలో “నూల్” ద్విపాత్రాభినయం పోషించడం గమనార్హం.

ఒకటి హీరోల దగ్గర ఉండగా మరొకటి విలన్ గ్రూపులో ఉంటుంది. అడవిలో ఈ సినిమా షూటింగ్ జరుగుతున్న సందర్భంలో “నూల్” తప్పిపోయింది. షూటింగ్ రద్దు చేసుకొని దాదాపు ఒకరోజంతా వెతికితే “నూలు” దొరకింది. నూల్ కోసం నిర్మాత అశ్వినీదత్ దాదాపు ఆరు లక్షల రూపాయల వెచ్చించారు.

ఆ రోజుల్లోనే ఈ సినిమా కోసం నిర్మాత అశ్వినిదత్ దాదాపు 75 లక్షల రూపాయల బడ్జెట్ ను కేటాయించారు. ఈ సినిమా 1983 ఏప్రిల్ 28న భారీ అంచనాల మధ్య విడుదల అయ్యింది. విడుదలైన మొదటి వారంలోనే 64 లక్షల రూ.ల వసూళ్లను రాబట్టింది. సూపర్ స్టార్, రెబల్ స్టార్ అభిమానులకు అనుగుణంగా దర్శకుడు రాఘవేంద్ర రావు ఈ సినిమాను రూపొందించడంతో బాక్సాఫీస్ వద్ద “అడవి సింహాలు” చిత్రం విజయవంతంగా నిలిచింది.

Lavanya Suresh

Lavanya Suresh is Senior News Reporter in Telugudesk.net. Lavanya Suresh covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

1 day ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago