Adipurush: బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వంలో ప్రభాస్ నటించిన చిత్రం ఆది పురుష్.ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ క్రమంలోనే ఈ సినిమా నుంచి మేకర్స్ టీజర్ విడుదల చేశారు.ఈ టీజర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుండగా కొందరు మాత్రం పెద్ద ఎత్తున ఈ టీజర్ పై భారీ స్థాయిలో ట్రోల్ చేస్తున్నారు.
ముఖ్యంగా ఈ సినిమాలో కొన్ని పాత్రలు హిందూ మనోభావాలు దెబ్బతీసేలా ఉన్నాయంటూ మండిపడటమే కాకుండా ఈ సినిమాని బాయ్ కాట్ చేయాలంటూ హాష్ టాగ్ ట్రెండ్ చేస్తున్నారు.ముఖ్యంగా ఈ సినిమాలో రావణాసురుడి పాత్రలో హనుమంతుడి పాత్రలో నటించినటువంటి నటీనటులపై తీవ్రస్థాయిలో అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి.
రావణాసురుడు శివుడి భక్తుడు ఆయన నుదుటిపై ఎప్పుడు అడ్డ నామాలు ఉంటాయి. కానీ ఈ సినిమాలో రావణాసురుడి నుదుటిపై అడ్డ నామాలు లేవని కొందరు ఈ తప్పులను గుర్తిస్తున్నారు. అదేవిధంగా హనుమంతుడి బట్టలు కూడా లెదర్ తో తయారు చేసినవని అలాగే హనుమంతుడికి గడ్డం మీసాలు ఉండడాన్ని కూడా తప్పుపడుతున్నారు.
ఇకపోతే వానర సైన్యం వానరులులా కాకుండా గొరిల్లాల రూపంలో ఉన్నారంటూ పెద్ద ఎత్తున ఈ టీజర్ గురించి కామెంట్లు చేయడమే కాకుండా ఇలా రామాయణం నేపథ్యంలో వస్తున్నటువంటి ఈ సినిమాలో ఈ విధమైనటువంటి తప్పులు దొర్లడంతో హిందూ మనోభావాలు దెబ్బతింటున్నాయని ఈ సినిమాని బాయ్ కాట్ చేయాలంటూ పెద్ద ఎత్తున నేటిజెన్లు సోషల్ మీడియాలో హాష్ ట్యాగ్ ట్రెండ్ చేస్తున్నారు. మొత్తానికి ఆది పురుష్ టీజర్ నేటిజెన్ల ట్రోలింగుకు భారీగా గురవుతుంది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…