Adipurush: పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ రాముడి పాత్రలో బాలీవుడ్ నటి కృతి సనన్ సీతమ్మ పాత్రలో నటించిన చిత్రం అదిపురుష్. రామాయణం ఇతిహాసం నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా జూన్ 16వ తేదీ విడుదలకు సిద్ధమవుతుంది. ఈ సినిమా విడుదల కానున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదల చేసిన పాటలు టీజర్ సినిమాపై భారీ అంచనాలను పెంచేసాయి.
ఇక ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వస్తూ ఒక విజువల్ వండర్ ల ఉండబోతుందని తెలుస్తుంది. ఇక ఈ సినిమా విడుదలకుండా నేపథ్యంలో తిరుపతిలో జూన్ ఆరవ తేదీ ప్రీ రిలీజ్ వేడుకను ఎంతో ఘనంగా నిర్వహించడానికి మేకర్స్ భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటివరకు ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో ఏ సినిమాకు చేయని విధంగా ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకను చేయడానికి భారీ ఏర్పాట్లు చేస్తున్నారు.
ఇక ఈ సినిమా వేడుకలో భాగంగా సుమారు లక్ష మంది అభిమానులు పాల్గొనే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారట. అంతే కాకుండా 200 మంది డాన్సర్ల చేత అలాగే 200 మంది సింగర్ల చేత ఈ వేదికపై పెర్ఫార్మెన్స్ చేయించబోతున్నారని సమాచారం. ఇక ఈ సినిమా వేడుకలో స్పెషల్ గా క్రాకర్స్ తయారు చేయించారని తెలుస్తుంది. ఈ క్రాకర్స్ కనుక పేల్చితే జైశ్రీరామ్ అనే శబ్దం వస్తుందట.
అన్ని విధాల వేడుకను ఘనంగా నిర్వహించి మేకర్స్ చరిత్ర సృష్టించబోతున్నారని తెలుస్తుంది.ఇక ఈ సినిమాని టి సిరీస్ బ్యానర్ పై నిర్మించిన విషయం మనకు తెలిసిందే. ఈ సినిమాకి బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వం వహించారు. ఇక ఈ సినిమా కోసం ప్రభాస్ అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…