Jabardasth: బుల్లితెరపై ప్రసారమవుతున్నటువంటి జబర్దస్త్ కార్యక్రమం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ కార్యక్రమంలో భాగంగా ఎంతోమంది కమెడియన్లుగా ఎంట్రీ ఇచ్చి అనంతరం వారందరూ కూడా ఇండస్ట్రీలో మంచి సక్సెస్ అందుకున్నారు. ప్రస్తుతం కొందరు హీరోలుగాను మరికొందరు డైరెక్టర్లుగా కమెడియన్లుగా కొనసాగుతూ ఎంతో బిజీగా గడుపుతున్నారు.
ఇలా జబర్దస్త్ కమెడియన్లు ప్రస్తుతం ఇండస్ట్రీలో స్టార్స్ లో కొనసాగుతూ భారీ స్థాయిలోనే ఆస్తిపాస్తులను కూడా పెట్టారనే తెలుసు కానీ జబర్దస్త్ కార్యక్రమంలో పాల్గొనే కమెడియన్లకు రెమ్యూనరేషన్ చాలా తక్కువగా ఉంటుంది కానీ ఆస్తులు ఈ స్థాయిలో ఎలా సంపాదించారన్న సందేహం అందరిలోనూ కలిగింది. అయితే ఇదే విషయం గురించి కమెడియన్ అదిరే అభి చేసినటువంటి కామెంట్స్ సంచలనంగా మారాయి.
తాను జబర్దస్త్ కార్యక్రమానికి రాకముందే సొంతంగా ఇల్లు కార్లు ఉన్నాయని తెలిపారు. నేను వృత్తిపరంగా సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఇక జబర్దస్త్ కార్యక్రమంలో రెమ్యూనరేషన్ చాలా తక్కువగా ఉంటుంది కానీ ఆ కార్యక్రమంలో కొనసాగుతూ కోట్లలో ఆస్తులు సంపాదించారు అనడం పూర్తిగా అవాస్తవమని ఈయన తెలిపారు.
ఇతర అవకాశాలు..
జబర్దస్త్ కార్యక్రమం ద్వారా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి కమెడియన్లు అందరూ కూడా ఇతర షోలను అలాగే పలు ప్రైవేట్ ఈవెంట్స్ లో పాల్గొనే అవకాశాలు అందుకుంటున్నారు. ఇలా రాత్రి పగలు కష్టపడుతూ ఇండస్ట్రీలో అవకాశాలు అందుకుంటూ ఆస్తులు కూడా పెట్టారే తప్ప జబర్దస్త్ రెమ్యూనరేషన్ తో ఆస్తులు కొన్నారు అనడం పూర్తిగా అవాస్తవమని తెలియజేశారు.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…