Featured

Adusumilli srinivas : భర్తను పంచుకున్న మహాతల్లి ఇందిరాదేవి… విజయనిర్మలతో మహేష్ తల్లి అనుబందం : అనలిస్ట్ ఆడుసుమిల్లి శ్రీనివాస్

Adusumilli Srinivas : సూపర్ స్టార్ కృష్ణ గారి సతీమణి ఇందిరా దేవి గారు కన్నుమూశారు, అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆమె పలు మార్లు ఆసుపత్రి కి వెళ్తూ వచ్చేవారు. అయితే మామూలుగా వెళ్లి వచ్చేస్తారు అని అందరూ అనుకున్నా ఈ సారి మాత్రం తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. ఆవిడ మరణం కృష్ణ గారిని ఆయన కుటుంబాన్ని తీవ్ర విషాదం లోకి నెట్టేసింది. ఇంతవరకూ ఎపుడూ కృష్ణ గారి భార్య ఇందిర గారు మీడియా ముందుకు రావడం జరగలేదు. ఆవిడ గొప్ప వ్యక్తిత్వం గురించి కృష్ణ గారి అభిమాని అనలిస్ట్ ఆడుసుమిల్లి శ్రీనివాసరావు గారు విజయ నిర్మల గారితో కృష్ణ గారి పెళ్లి వంటి విషయాల గురించి చెప్పి ఆమె వ్యక్తిత్వం ఇలాంటిదో అందరికీ తెలియజేసారు.

భర్తను పంచుకున్న ఇల్లాలు…

1962 నవంబర్ లో కృష్ణ గారితో ఇందిరాదేవి గారి పెళ్లి జరిగింది. ఆమె ఊరు కంచెర్ల పాలెం అయితే కృష్ణ గారిది బుర్రిపాలెం. ఇక వారికి కూతురు మంజుల, పెద్దబ్బాయి రమేష్ పుట్టాక కృష్ణ గారికి సినిమాల్లో అవకాశం వచ్చి రెండు సినిమాల్లో హీరోగా సంతకం చేసారు ఒకే బ్యానర్ కు అలా తేనెమనసులు, కన్నె మనసులు వంటి సినిమాల్లో నటించారు కృష్ణ. ఇక 1970 వరకు కృష్ణ గారు వరుసగా సినిమాలను చేసారు. అయితే ఆయన సినిమాల్లో ఎక్కువగా హీరోయిన్ గా విజయ నిర్మల ఉండటం వల్ల పరిచయం ప్రేమ గా మారి పెళ్లి చేసుకోవాలి అని నిర్ణయించుకున్నారు. పెళ్ళైన విజయనిర్మల గారికి సినిమాల్లోకి వచ్చే సమయానికి కొడుకు ఉన్నాడు. ఇక ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు. వారి పెళ్లిని ఇందిర గారు అంగీకరించడం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది.

కానీ ఇందిర గారు కుటుంబం, పిల్లలు ఇబ్బంది పడకూడదు అని భర్త నిర్ణయాన్ని గౌరవించింది. అజ్ఞాతంలో ఉండి కుటుంబాన్ని సవ్యంగా నడిపారు. ఇక కృష్ణ సినిమాలలో బిజీగా ఉన్నా ఇందిరా గారే ఐదు మంది పిల్లల బాగోగులు చూసుకున్నారు. ఏ ఆడది చేయనటువంటి గొప్ప త్యాగం ఆవిడ చేసారు, భర్తను ఇంకో మహిళతో పంచుకున్నారు. నిజంగానే ఇందిర గారు గొప్ప మనిషి అంటూ ఆడుసుమిల్లి శ్రీనివాసరావు గారు అభిప్రాయపడ్డారు. ఇక ఎటువంటి గొడవలు మనస్పర్తలు లేకుండా కృష్ణ, ఇందిర, విజయ నిర్మల గారి జీవితాలు సాగాయి అంటూ చెప్పారు. విజయ నిర్మల గారితో కూడా ఎటువంటి వివాదలు ఇందిర గారికి లేకపోవడం చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది అంటూ చెప్పారు.

Bhargavi

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago