Colours Swathi : తెలుగు బుల్లితెర మీద ప్రసారం అయిన ‘కలర్స్’ అనే ప్రోగ్రాం ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది స్వాతి రెడ్డి. ఇప్పటికీ తెలుగు అభిమానుల మదిలో స్వాతి రెడ్డి, కలర్స్ స్వాతి లానే గుర్తుండి పోయింది. తరువాత క్యారెక్టర్లు, హీరోయిన్లకి డబ్బింగులు చెప్పడంతో తన కెరీర్ ని మొదలు పెట్టింది. కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన ‘డేంజర్’ సినిమాతో నటిగా మారిన స్వాతి ‘అష్టాచెమ్మ’ సినిమాతో హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది. నటిగా తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న కలర్స్ స్వాతి 2018 లో వికాస్ తో వివాహం జరిగిన తరువాత సినిమాలకి దూరంగా ఉంటోంది.
విడాకుల కోసం కోర్టును ఆశ్రయించిన స్వాతి…
అయితే ఇప్పుడు సినిమాలలోకి రీ ఎంట్రీ ఇవ్వబోతోంది. పెళ్లి తరువాత భర్త తో మనస్పర్థల కారణంగా విడిపోతున్నారు అని అప్పట్లో వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. కానీ వీరు సంతోషంగా ఉన్నారు. కాకపొతే రీ ఎంట్రీలో విడాకుల నేపథ్యంలో వస్తున్న సినిమాలో నటిస్తోంది స్వాతి రెడ్డి. శ్రీకాంత్ నాగోటి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ‘మంత్ ఆఫ్ మధు’ అనే టైటిల్ తో ప్రేక్షకులకు ముందుకు రాబోతోంది. ఈ సినిమాలో కలర్స్ స్వాతి, నవీన్ చంద్రతో కలసి నటించనుంది.
ఒకరినొకరు ప్రేమించి పెళ్ళి చేసుకున్న ఒక జంట, కొన్ని మనస్పర్ధల కారణంగా విడిపోతారు. ఈ సినిమాలో నవీన్ చంద్ర తాగుబోతుగా, తిరుగుబోతుగా ఉన్న భర్త క్యారెక్టర్లో నటిస్తున్నారు. కోర్టులో విడాకులకోసం ప్రయత్నించే భార్య పాత్రలో కలర్స్ స్వాతి నటించనున్నారు. శ్రీకాంత్ నాగోటి దర్శకత్వంలో వచ్చిన ‘భానుమతి అండ్ రామకృష్ణ’ అనే సినిమా అప్పట్లో పరవాలేదు అనిపించుకుంది. మరి ఇప్పుడు కలర్స్ స్వాతి రీ ఎంట్రీ లో వస్తున్న ఈ సినిమా ఎలా ఆకట్టుకుంటుందో చూడాలి.
కర్ణాటక రాష్ట్రంలోని బెళగావి జిల్లాలో చోటుచేసుకున్న ఒక దారుణ ఘటన కుటుంబాల్లో పెరుగుతున్న అసహనం ఎంత ప్రమాదకరంగా మారుతుందో మరోసారి…
సినీ దర్శకుడు పూరి జగన్నాథ్ తన కొత్త పాడ్‌కాస్ట్‌లో మరోసారి తనదైన స్టైల్‌లో ఆలోచింపజేసే విషయాలను ప్రస్తావించారు. ‘సైన్స్ అండ్…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన కెరీర్‌లోనే కాకుండా వ్యక్తిగత జీవితంలోనూ లగ్జరీకి ప్రాధాన్యత ఇస్తున్నట్లు మరోసారి రుజువైంది. ఇప్పటికే…
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర్ రావు కన్నుమూశారు. 90 ఏళ్ల వయసులో ఆయన బుధవారం ఉదయం తుదిశ్వాస…
తెలుగు సినీ పరిశ్రమపై ఎప్పుడూ ముక్కుసూటిగా మాట్లాడే నటుడు జేడీ చక్రవర్తి తాజాగా మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు.…
సినిమా రంగంలో నటీనటుల కష్టాలు, అంకితభావం గురించి తరచూ వినిపిస్తుంటుంది. అయితే కొంతమంది స్టార్ హీరోయిన్లు తమ పనిపై చూపించే…