Featured

తాలిబన్ల ప్రభావం.. ఇండియాలో వాటి ధరలు పెరిగే అవకాశం..

ఆప్ఘనిస్తాన్‌లో తాలిబన్ల అరాచకాలు తారాస్థాయికి చేరుకున్నాయి. ఏ సైనికుడిని, పౌరుడిని కూడా వదలకుండా దాడులు చేస్తున్నారు. ఏకంగా అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడూ దేశం విడిచి అమెరికా పారిపోయారంటే… ఆ దేశంలో ప్రజలకు రక్షణ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. అంతలా వారి ఆగడాలకు అడ్డూ అదుపూ లేకుండా పోతున్నాయి.

ఇలా ఉగ్రవాదులకు దేశ సైన్యం మోకరిల్లడం అనేది బహుశా ఎక్కడా చూసివుండం. ఆప్ఘనిస్తాన్‌లో అది జరిగిపోయింది. ఇప్పడు ఆప్ఘనిస్తాన్‌ మొత్తం తాలిబన్లు స్వాధీనం చేసుకున్నారు. అలాంటి వారున్న దేశంలో వ్యాపార, వాణిజ్యాలు నెరపడం కష్టం. అందువల్ల ఇండియాకి ఆప్ఘనిస్థాన్ నుంచి ఇప్పుడు కొన్ని రకాల వస్తువుల దిగుమతులు ఆగిపోతాయి. ఫలితంగా వాటి ధరలు ఆకాశాన్ని అంటుతాయి. అటువంటి వస్తువులు ఏంటో చూద్దాం. అందులో ఎక్కువగా డ్రై ఫ్రూట్స్. ఆ దేశం చాలా రకాల డ్రైఫ్రూట్స్‌ని ఇండియాకి దిగుమతి చేస్తోంది.

అందులో కూడా ముఖ్యంగా ఎండు ద్రాక్ష అక్కడి నుంచి పెద్ద ఎత్తున భారత్ వస్తున్నాయి. ఇప్పుడు వాటి ధర విపరీతంగా పెరిగే అవకాశం ఉంటుంది. వాటితో పాటు ఇంగువ, జీలకర్ర , ఔషధాల్లో వాడే తొక్కలు, చర్మాలు, కొన్ని రకాల మందులు, మూలికలు, మొక్కలు, ఔషధ మొక్కలు, ఔషధ నూనె గింజల వంటి వాటిని ఇండియా దిగుమతి చేసుకుంటోంది. ఇప్పుడు వీటి దిగుమతి ఆగిపోయే ప్రమాదం ఉంది. దీంతో అవి మన దేశంలో విపరీతంగా ధరలు పెరిగే అవకాశం ఉంటుంది.

ముఖ్యంగా జీలకర్ర ఇప్పటికే చాలా ధర ఉంది. అది ఇంకా పెరగడం ఖాయం. తాలిబన్లతో మరో ముప్పు కూడా ఉంది. వారు ఒకే దగ్గర కుదురుగా ఉండరు. చుట్టుపక్కల ప్రాంతాలపై కూడా వారి కన్ను పడుతుంది. అలా… గల్ఫ్ దేశాల్లో ఉగ్రవాద సమస్య పెరుగుతుంది. దీంతో పెట్రోల్, డీజిల్ ధరలు కూడా పెరిగే అవకాశం ఉంటుంది. అందువల్ల గల్ఫ్ దేశాల్లో ఏ చిన్న అలజడి రేగినా… అది ఇండియాకి పెద్ద దెబ్బే అవుతుంది. దీని ప్రభావం బంగారంపై కూడా పడే అవకాశం ఉంది.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago