General News

Crime News: ప్రేమించి పెళ్లి చేసుకున్నందుకు..! భర్త, అత్తామామలు ఇచ్చిన బహుమానం ఇది..!

Crime News: పెద్దలను ఎదిరించి ప్రేమ వివాహం చేసుకుంది ఆ మహిళ. మొదట్లో భర్త, అత్తామామలు బాగానే చూసుకున్నా.. తర్వాత వారి వక్రబుద్ది బయటపడింది. అదనపు కట్నం తేవాలని వేధించడం మొదలు పెట్టారు. దీంతో ఆమె ఆ వేధింపులకు తట్టుకోలేక తనవు చాలించింది. ఈ ఘటన సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.

సిద్దిపేట జిల్లా దుబ్బాక మండల పరిధిలో దొర్ల శోభ–వెంకట్‌ రెడ్డిలు దంపతులు. వీళ్లకు 28 ఏళ్ల ప్రవళిక అనే కుమార్తె ఉంది. ఆమె అదే గ్రామానికి చెందిన చామకూర మహేష్ ను ప్రేమించింది. మొదట వీరి ప్రేమకు ఒప్పుకోకపోవడంతో.. పోరాడి ప్రేమను సాధించుకొని వివాహం చేసుకున్నారు.

ఐదేళ్ల క్రితం అతడికి అమ్మాయి తరఫు తల్లిదండ్రలు కట్న కానుకలు కూడా బాగానే ఇచ్చారు. వారిద్దరు ప్రేమించుకొని.. పెద్దలను ఒప్పించి వారి సమక్షంలోనే పెళ్లి చేసుకోవడంతో.. లాంఛనాలతో అన్ని అబ్బాయికి ఇవ్వాల్సినవి ఇచ్చారు.

పుట్టింటికి వచ్చిన ప్రవళిక తెల్లవారుజామున ..


బంగారు ఆభరణాలు, ఇతర సామగ్రి కూడా ఇచ్చారు. మొదట వీరి కాపురం ఎలాంటి ఆటంకాలు.. మనస్పర్థలు లేకుండా సాగింది. అయితే మహేష్ మిషన్ భగీరథలో అవుట్ సోర్సింగ్ లో ఉద్యోగం చేస్తుండేవాడు. తర్వాత అతడి ఉద్యోగం పోయింది. అప్పటి నుంచి అతడు ఇంటి వద్దనే ఉంటున్నాడు.
అయితే అప్పటి నుంచి ఆమెను అదనపు కట్నం తీసుకురావాలని అటు భర్తతో పాటు.. అత్తమామలు వేధించడం సాగించారు. ఈ విషయాన్ని ఆమె తన తల్లిదండ్రులకు చెప్పడంతో.. ఆరు నెలల క్రితం రూ.4లక్షలను అదనపు కట్నం కింద ముట్టజెప్పారు. అయినా ఆ దుర్మార్గుడికి ఆశ చావలేదు. ఇంకా కావాలని బలవంతం చేయడంతో.. భరించలేకపోయింది. పుట్టింటికి వచ్చిన ప్రవళిక తెల్లవారుజామున ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. తన ఆత్మహత్యకు గల కారణాలను ఓ సూసైడ్ నోట్ రాసింది. అందులో ఏముందంటే.. తన చావుకు భర్త, అత్తింటి వారే కారణమని.. అదనపు కట్నం తీసుకురావాలని వేధించే వారని, తనకు న్యాయం జరగాలని, ‘అమ్మా నాన్న మిస్‌ యూ అంటూ’ ఆమె సూసైడ్‌ లెటర్‌ రాసి ఆత్మహత్య చేసుకుంది. ఇక దీనిపై ఆ వివాహిత తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు స్థానిక ఎస్సై తెలిపారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని నిజామాబాద్‌ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించినట్లు పేర్కొన్నారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago