తమిళ సినిమాకు చెందిన పలువురు హీరోలు తెలుగు సినీ అభిమానులకు పరిచయం కావడం వెరీ కామన్. వీరు నటించే పలు సినిమాలు తెలుగులోకి డబ్బింగ్ రూపంలో వస్తుంటాయి. తెలుగు జనాలు కూడా వీరి సినిమాలను బాగానే ఆదరిస్తారు. తెలుగు హీరోలతో సమానంగా వీరి సినిమాలు కూడా చూస్తారు. ఇక సూర్య లాంటి హీరోల సినిమాలు వస్తే మాత్రం ఒక తెలుగు సినిమా లాగానే భావిస్తారు.
సూర్య మాత్రమే కాదు.. తమిళ హీరోలు విజయ్, అజిత్, కమల్ హాసన్, రజనీకాంత్ కు కూడా తెలుగులో మంచి ఆదరణ, గుర్తింపు ఉంది. తాజాగా పలువురు తమిళ హీరోలు కూడా తెలుగులోకి నేరుగా వస్తున్నారు. ఇక్కడ సినిమాలు చేస్తూ తమ మార్కెట్ ను పెంచుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇప్పుడే కాదు.. గతంలో కూడా ఓ తమిళ హీరో నేరుగా తెలుగులో సినిమా చేశాడు. ఇంతకీ తను ఎవరు? ఇప్పుడు తను ఏం చేస్తున్నాడు? అని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..
గతంలో వాన అనే తెలుగు సినిమాలో నటించాడు వినయ్ రాయ్. ఈ సినిమాకు ఎమ్మెస్ రాజు దర్శకత్వం వహించాడు. అయితే ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర పెద్దగా విజయం సాధించలేదు. కానీ పాటలు మాత్రం మంచి సక్సెస్ అందుకున్నాయి. ఈ చిత్రం మ్యూజికల్ హిట్ అని చెప్పుకోవచ్చు. ఇప్పటికీ ఈ సినిమాకు సంబంధించిన పాటలు బాగా వినిపడుతాయి. వాస్తవానికి వినయ్ చాలా తమిళ సినిమాలు చేశాడు. ఆయన నటించిన పలు సినిమాల్లో ఓ తమిళ సినిమా తెలుగులో డబ్బై నీవల్లే నీవల్లే అనే పేరుతో విడుదల అయ్యింది. తెలుగులో వినయ్ నటించిన ఒకే సినిమా అయిన వాన సినిమా జనాల మదిలో నిలిచిపోయింది.
ఈ సినిమా తర్వాత మళ్లీ వినయ్ కనిపించలేదు. తెలుగుతో పాటు తమిళంలోనూ అంతగా కనిపించలేదు. చాలా సంవత్సరాల తర్వాత మరో డబ్బింగ్ సినిమా ద్వారా వినయ్ ఎంట్రీ ఇచ్చాడు. విశాల్ హీరోగా చేసిన డిటెక్టివ్ లో వినయ్ విలన్ రోల్ చేశాడు. అలాగే శివ కార్తికేయన్ హీరోగా చేసిన డాక్టర్ సినిమాలోనూ నెగెటివ్ రోల్ చేశాడు. డాక్టర్ సినిమా తమిళంలోనే కాకుండా తెలుగులోనూ మంచి విజయాన్ని అందుకుంది. ఈ రెండు సినిమాలు ఆయనకు మంచి పేరు తెచ్చాయి. ప్రస్తుతం విలన్ గా సెటిల్ కాబోతున్నాడు వినయ్. ఇక వినయ్ రాయ్ తనలోని నటుడిని డాక్టర్, డిటెక్టివ్ సినిమాల ద్వారా ఇండస్ట్రీ కి అయితే చూపించాడు. మరి రానున్న రోజుల్లో మంచి విలన్ గా, లిడఁటే క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా అయినా అవకాస్లు వస్తాయో లేదో వేచి చూడాలి.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…