Medaram Jatara 2022: మేడారంలో వింత ఘటన..! ఇలా కూడా చేయొచ్చా..?వీడియో వైరల్..
Medaram Jatara 2022: గిరిజన కుంభమేలా మేడారం జాతకు మరో మూడు రోజుల మాత్రమే ఉంది. ఇప్పటికే లక్షలాది భక్తులు సమ్మక్క-సారలమ్మ దేవతను దర్శంచుకున్నారు. మరోవైపు ప్రభుత్వం కూడా అన్ని ఏర్పాట్లను చేసింది. తెలంగాణ మంత్రులు ఎప్పటికప్పుడు జాతరను పర్యవేక్షిస్తున్నారు.
మన తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా మధ్యప్రదేశ్, చత్తీస్ గడ్, మహారాష్ట్రల నుంచి భక్తులు తరలివస్తున్నారు. అమ్మలను దర్శించుకుంటున్నారు. తన కోరికలు నెరవేరాలంటూ.. తల్లులకు బంగారం(బెల్లం)ని సమర్పిస్తున్నారు.
మేడారం అంటేనే గిరిజన జాతర గిరిజన సంప్రదాయాలకు అనుగుణంగానే పూజా క్రతువు.. తల్లులను వనం నుంచి గద్దెలవరకు తీసుకువస్తారు. ముఖ్యంగా మందు, మాంసం విక్రయాలు జరుగుతుంటాయి. భక్తులు మేకలను, కోళ్లను బలిస్తుంటారు. దీంతో మేడారంలోనే పెద్ద ఎత్తున కోళ్ల విక్రయాలు, మేకల విక్రయాలు జరుగుతున్నాయి.
అయితే మేడారం జాతలో మొబైల్ నెట్ వర్క్, మొబైల్ హోటళ్లు, మొబైల్ మెకానిక్, మొబైల్ హస్పిటల్ ఇలా అన్ని సేవలు భక్తుల వద్దకే చేరుతుంటాయి. అయితే తాజాగా మొబైల్ మందు విక్రయాలు కూడా ఊపందుకున్నాయి. వాహనాల మీదే మద్యం షాపులు భక్తుల వద్దకు చేరుతున్నాయి. ప్రస్తుతం ఇలా ఓ ఆటోలో మద్యం తోపాటు కూల్ డ్రింక్స్ అమ్మతున్న వీడియో వైరల్ అవుతోంది. ప్రజల వద్దకే మద్యం అన్న రీతిలో ఈ వీడియో ఉండటంతో.. నెటిజెన్లు నవ్వుకుంటున్నారు. ప్రభుత్వం కూడా మేడారం జాతరలో ఇలా మద్యం అమ్మకాలను పెద్దగా పట్టించుకోదు. మేడారం జాతరకు ముందే అక్కడ పెద్ద ఎత్తున మద్యం దుకాణాలకు ఎక్సైజ్ శాఖ పర్మిషన్లు ఇస్తుంటుంది. ఏది ఏమైనా ప్రజలకు ఏ ఇబ్బందులు కలుగకుండా మద్యం కూడా మందుబాబుల చెంతకు చేరడంతో వాళ్లంతా ఫుల్ ఖుషీ అవుతున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…