Featured

Agent Tina : కమల్ ‘విక్రమ్’ లో నటించిన ఏజెంట్ టీనా ఎవరో తెలిస్తే షాక్ అవుతారు ?

కమల హాసన్ హీరోగా నటించిన ‘విక్రమ్’ చిత్రం ఈ జూన్ 3 వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి అందరికి తెలిసిందే . కాగా ఈ చిత్రం ఊర మాస్ అంటూ ప్రేక్షకుల నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వినిపించటమే కాకుండా మంచి కలెక్షన్లు రాబడుతూ బ్లాక్ బస్టర్ దిశగా దూసుకుపోతోంది. ఇక మన కథానాయకుడు కమల్ హాసన్ తన సహజమైన నటనతో అందర్నీ మంత్రముగ్ధుల్ని చేయగా ఈ చిత్రంలో ఒక ఫిమేల్ క్యారెక్టర్ మాత్రం అందర్నీ ఆకర్షించింది. అంతే కాదు ఆవిడ యాక్షన్ కి థియేటర్లో ప్రేక్షకులు లేచి విజిల్ వేసే రేంజ్ లో తన మాస్ పర్ఫార్మెన్స్ తో అందరి దృష్టిని ఆకట్టుకుంది. అసలు ఆ ఫిమేల్ క్యారెక్టర్ ఎవరనుకుంటున్నారా… ఆవిడే అండి ఏజెంట్ టీనా. ఇప్పుడు సినిమా చూసిన అందరి ప్రేక్షకుల మదిలో ఎవరు ఈ ఏజెంట్ టీనా.. అనే ప్రశ్న మెదలాడుతోంది…ఏజెంట్ టీనా అసలు పేరు వాసంతి. కాగా ఈవిడ ఒక సాధారణ కుటుంబం నుంచి వచ్చిన అమ్మాయి అలాగే ఈమె పుట్టి పెరిగింది చెన్నై..

అయితే వాసంతి వృత్తిరీత్యా నృత్య కళాకారిణి. అయితే తమిళ చిత్రాలలో గ్రూప్ డాన్సర్ గా కెరీర్ ని ప్రారంభించిన ఆమె… తన కృషి అభిరుచితో అసిస్టెంట్ డాన్స్ కొరియోగ్రాఫర్ గా మారింది. అంతేకాదు ఈమె 1992 నుంచి అంటే గత 30 సంవత్సరాలుగా తన సినీ ప్రయాణాన్ని కొనసాగిస్తూ అనేక మంది డాన్స్ కొరియోగ్రాఫర్ లతో కలిసి పనిచేసింది. అయితే ప్రస్తుతం మాత్రం డాన్స్ కొరియోగ్రాఫర్ అయిన దినేష్ మాస్టర్ దగ్గర అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ గా పనిచేస్తుంది. అయితే ఈమె తన తొలి రోజుల్లో నయనతార, త్రిష, అనుష్క, అమీ జాక్సన్ వంటివారికి నృత్యం నేర్పించడమే కాకుండా హీరో విజయ్ భగవతి లోనూ, అజిత్ వాలిమై లోనూ నటించారు. విక్రమ్ సినిమాలో నటించే అవకాశం మీకు ఎలా వచ్చిందని వాసంతి అని ఒక ఇంటర్వ్యూలో అడగగా… విజయ్ “మాస్టర్ ” సినిమాలో వాసంతి ఒక పాటకి అసిస్టెంట్ గా పనిచేటప్పుడు లోకేష్ కనగరాజ్ ఆమెను చూసి.. ఆఫ్ స్క్రీన్ వైఖరిని ఇష్టపడి వాసంతిని తాను తీయబోయే విక్రమ్ సినిమాలో నటింపజేయాలని నిర్ణయించుకున్నాడు.

అంతటితో ఆగకుండా లోకేష్ సార్ దినేష్ మాస్టర్ ని విక్రమ్ చిత్రంలో వాసంతికి ఒక పాత్ర ఉంది ఒప్పుకుంటుందా అని ఫోన్ చేసి అడిగారట. ఈ విషయం దినేష్ మాస్టర్ నాకు సమాచారం అందించారు. నేను ఆడిషన్ కి వెళ్లి నా అభిప్రాయం తెలియజేశాను. దానితో ఈ విక్రమ్ చిత్రంలో చేసిన ఏజెంట్ టీనా క్యారెక్టర్ కు మంచి రెస్పాన్స్ రావటమే కాదు కమల్ హాసన్ సార్ తో నటించాలనే తన కోరిక నెరవేరింది.

అంతేకాదు తన క్యారెక్టర్ గాను అన్బరీవ్ మాస్టర్ కచ్చితమైన అవుట్ పుట్ వచ్చేలా జాగ్రత్త వహిస్తూ .. విన్యాసాలు చేసేటప్పుడు తనకి సూక్ష్మమైన నైపుణ్యాన్ని నేర్పించేవారని ఏజెంట్ టీనా ఒక ఇంటర్వ్యూలో తెలియజేశారు. అంతే కాదు కమల్ హాసన్, ఫహద్ ఫాజిల్, సూర్య విజయ్ సేతుపతి వంటి దిగ్గజాలు నటించిన ఈ చిత్రంలో ఏజెంట్ టీనాగా నటించిన వాసంతి తన అద్భుతమైన పర్ఫార్మెన్స్ తో అందర్నీ మంత్రం ముగ్దుల్ని చేసి తన పెర్ఫార్మెన్స్ కి సరిగ్గా నూటికి నూరు శాతం న్యాయం చేసింది మన వాసంతి.

Lavanya Suresh

Lavanya Suresh is Senior News Reporter in Telugudesk.net. Lavanya Suresh covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago