తెలుగు ఓటీటీల్లో దూసుకువెళ్తోంది ‘ఆహా’ ఓటిటీ. అల్లు అరవింద్ ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన ఈ ‘ఆహా’ ఓటీటీ గురించి ప్రత్యేకంగా తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేయాల్సిన పని లేదు. ఆహా వచ్చిన తక్కువ కాలంలోనే అందరి అభిమానాలను పొందింది. ఎప్పటికప్పుడు కొత్తగా అభిమానుల ముందుంది. సినిమాలు, వెబ్ సిరీస్ లతోనే కాకుండా టాక్ షోలతో గుర్తింపు పొందుతోంది.
ఇటీవల బాలయ్యతో చేసిన అన్ స్టాపబుల్ ఎంత సక్సెస్ అయిందో మనకందరికి తెలిసిందే. బాలక్రిష్ణ అన్ స్టాపబుల్ షో ఓటీటీలో దుమ్ము రేపుతోంది. తాాజాగా మరో సంచాలనానికి తెరతీసింది ఆహా..‘తెలుగు ఇండియన్ ఐడల్’ పేరుతో సరికొత్త షోతో ఆడియన్స్ ముందుకు రాబోతోంది. ఇంతకుముందు మననకు ఇండియన్ ఐడల్ షో గురించి తెలుసు.
హిందీలో ప్రసారమైన ఈ షో దేశవ్యాప్తంగా చాలా ప్రాచుర్యాన్ని పొందింది. సింగింగ్ కాంపిటీషన్ షోగా అందర్ని ఆకట్టుకోంది. మన తెలుగు వ్యక్తులు శ్రీరామ్ చంద్ర, కారుణ్య, రేవంత్ వంటివారు ఇండియన్ ఐడల్ లో పాల్గొని విజేతలుగా నిలిచారు. అయితే ఇప్పడు తెలుగులో కూడా ఇలా సింగింగ్ కాంపిటీషన్ కోసం ఆహా.. తెలుగు ఇండియన్ ఐడల్ ను ప్రారంభించనుంది. ఇందులో తెలుగు టాలెంట్ ను ఎంకరేజ్ చేయనుంది.
దీనికి సంబంధించి ఇప్పటికే అధికారిక ప్రకటన కూడా వెల్లడించింది ఆహా. ఇందుకు సంబంధించి ఆడిషన్స్ కు సంబంధించిన షెడ్యూల్ కూడా ప్రకటించింది. డిసెంబర్ 26న తొలి ఆడిషన్స్ నిర్వహించనున్నారు. ఇందుకోసం 14 నుంచి 30 ఏళ్ల మధ్య ఉన్న గాయనీగాయకులకు ఆహ్వానం అందించారు. ఇక ఈ ఆడిషన్స్ హైదరాబాద్ జూబ్లిహిల్స్‌లోని ఒయాసిస్ స్కూల్‌లో ఆడిషన్స్‌ను నిర్వహించనున్నారు. తాజాగా ‘ఆహా’ తీసుకువచ్చే ఈ షో సక్సెస్ అవుతుందో లేదో చూడాలి.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…