Featured

నా కూతురు ఏం తప్పు చేసిందని ఇలా చేస్తున్నారు.. ఆవేదన వ్యక్తం చేసిన యాంకర్ రవి భార్య..!

తెలుగులో ప్రసారం అవుతున్న అతి పెద్ద రియాల్టీ షోలో మొదట 19 మంది కంటెస్టెంట్లు అడుగుపెట్టారు. అందులో చాలామంది కొత్తవాళ్లు మాత్రమే ఉన్నారు. తెలిసిన వాళ్లు చాలా తక్కువ మంది ఉన్నారు. ఇక అందులో ఎక్కువగా యాంకర్ రవి ప్రతీ ఒక్కరికీ సుమపరిచితమే.

యాంకర్ గా తన ట్యాలెంట్ ఏంటో నిరూపించుకున్నాడు. దాదాపు అతడు టాప్ 5లో ఉంటాడని.. అందరూ అనుకున్నారు కానీ చివరకు వచ్చే సరికి 12వ వారంలో అనూహ్యంగా బయటకు వచ్చాడు. దీంతో అతడి ఫ్యాన్స్ షాక్ కు గురవ్వడంతో పాటు.. ఆగ్రహం కూడా వ్యక్తం చేశారు. ఇక యాంకర్ రవితో పాటు.. తన కటుంబసభ్యులను కూడా యూట్యూబ్..ప్రైవేట్ వెబ్ సైట్లలో నెగెటివ్ కామెంట్లు చేశారనే కారణంతో అతడు పోలీసులను ఆశ్రయించిన విషయం తెలిసిందే.

నెగిటివ్ గా మాట్లాడే వారికి.. ఇలా సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్లు కామెంట్లు చేసేవారికి ఇది ఆరంభం మాత్రమే అని.. వారిపై ఇకమీదట చర్యలు అధికంగా ఉంటాయని కూడా యాంకర్ రవి హెచ్చరించాడు. ఇక దీనిపై రవి భార్య నిత్యా మాట్లాడుతూ.. రవి హౌజ్ లోకి వెళ్లకముందే.. రవిపై ట్రోలింగ్స్ చేస్తారని.. నువ్ స్ట్రాంగ్‌గా ఉండాలని చెప్పాడని తెలిపాడు. రవికి సంబంధించి ఏ వీడియో చూసిన విపరీతంగా ట్రోల్స్ చేశారని.. తాను అవి తీసుకోలేకపోయానని ఆవేదన వ్యక్తం చేశారు.

తమకు సంబంధించి సోషల్ మీడియా అకౌంట్లలో.. రవి అకౌంట్లోనే కాకుండా.. నా అకౌంట్లో.. తన కూతురు అకౌంట్లో కూడా విపరీతంగా ట్రోల్స్ చేశారని..చాలా వరకు అవి డిలీట్ చేశానని చెప్పారు. ఫేక్ పేజ్ లు క్రియేట్ చేసి కామెంట్లు పెట్టేవారని వాపోయింది. ధైర్యం ఉంటే.. సొంత పేజ్ నుంచి పోస్ట్ లు పెట్టండి అంటూ చెప్పారు. మీరు ఎవరికైనా సపోర్టు చేస్తే చేయండి కానీ.. ఇలా వేరే వాళ్లకు కించపరిచే విధంగా పోస్టులు ఎదుకు పెడుతున్నారు.. తన ఫ్యామిలీ అంత తప్పు ఏం చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు నిత్యా సక్సేనా.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

3 weeks ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

3 weeks ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

4 weeks ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

4 weeks ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

4 weeks ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

4 weeks ago