Air India plane crash - Former Chief Minister Vijay Rupani dies!
Vijay Rupani : గుజరాత్‌ను దిగ్భ్రాంతికి గురిచేస్తూ ఒక పెను విషాదం చోటుచేసుకుంది. ఎయిర్ ఇండియా విమానం అహ్మదాబాద్‌లో కుప్పకూలిన ఘటనలో మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపాణి మరణించారని టికెట్ ఆధారంగా ఎయిర్ ఇండియా అధికారికంగా ధృవీకరించింది. ఈ వార్త యావత్ దేశాన్ని శోకసంద్రంలో ముంచెత్తింది.
ప్రమాదం జరిగిన వెంటనే సహాయక చర్యలు ముమ్మరం చేశారు. NDRF (జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం)కి చెందిన 90 మంది సిబ్బంది అహ్మదాబాద్‌లో సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. క్షతగాత్రులను కాపాడేందుకు, సహాయక చర్యలను వేగవంతం చేసేందుకు వడోదర నుండి అదనంగా మరో 3 బృందాలు హుటాహుటిన బయలుదేరాయి.
గురువారం నాడు అహ్మదాబాద్ విమానాశ్రయంలో చోటుచేసుకున్న Air India AI-171 విమాన ప్రమాదం తీవ్ర కలకలం రేపింది. ఈ విమానంలో మొత్తం 242 మంది ప్రయాణికులు ఉండగా, వారిలో గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ కూడా ఉన్నారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా దిగ్భ్రాంతిని కలిగించింది.
Director General of Civil Aviation (DGCA) అందించిన సమాచారం ప్రకారం, విమానంలో 242 మంది ప్రయాణికులు ఉన్నారు. వీరిలో 12 మంది సిబ్బంది ఉన్నారు. విమానం ప్రమాదానికి గురికావడానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఈ ఘటనపై DGCA విచారణకు ఆదేశించింది.
ప్రమాద సమయంలో విమానంలో ఉన్న ప్రయాణికుల భద్రత గురించి అధికారులు ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తున్నారు. సహాయక చర్యలు వేగంగా కొనసాగుతున్నాయి.
తెలుగు ఇంటి వంటల్లో ఊరగాయకు ఉన్న స్థానం ప్రత్యేకం. వేడివేడి అన్నంలో ఒక ముద్ద పచ్చడి ఉంటే చాలు, భోజనానికి…
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పర్యాటకం, ఉద్యోగాలు, వ్యాపార ప్రయాణాలు విపరీతంగా పెరిగిపోయాయి. ఒక నగరం నుంచి మరో నగరానికి, ఒక దేశం…
ప్రస్తుతం ప్రభుత్వ రంగ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా…
తెలంగాణలో క్రికెట్‌కు మరింత ప్రోత్సాహం అందించే లక్ష్యంతో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న టీజీ20 లీగ్ ప్రారంభానికి సర్వం…
తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్‌గా, నటిగా సుపరిచితమైన విష్ణుప్రియ భీమినేని మరోసారి వార్తల్లో నిలిచారు. టెలివిజన్ షోలు, రియాలిటీ కార్యక్రమాలు,…
వ్యవసాయం అనేది దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక. రైతు సంతోషంగా ఉంటేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది. అయితే…