Railway Station: సికింద్రాబాద్ స్టేషన్‌కు ఎయిర్‌పోర్టు లుక్..! తాజాగా టెండర్లకు ఆహ్వానం..?
Railway Station: కేంద్ర ప్రభుత్వం దేశ వ్యాప్తంగా రైల్వే స్టేషన్లలో ఆధునిక హంగుల్ని సమకూరుస్తోంది. ఎయిర్ పోర్టులకు ధీటుగా రైల్వే స్టేషన్లను డెవలప్మెంట్ చేసేలా కార్యాచరణ రూపొందిస్తోంది. దీని కోసం కేంద్రం గతంలో కూడా ప్రతిపాదనలు చేసింది.
ఇండియన్ రైల్వే స్టేషన్స్ కార్పోరేషన్ ( ఐఆర్ఎస్డీసీ)కి రైల్వే స్టేషన్ల ఆధునీకీకరణను అప్పగించింది. అయితే అది కార్యరూపం దాల్చలేదు. ఐఆర్ఎస్డీసీని రద్దు చేసి ఆ బాధ్యతలను రైల్ ల్యాండ్ డెవలప్మెంట్ అథారిటీ( ఆర్ఎల్డీఏ) కు అప్పగించినా ముందుకు పడలేదు.
చివరకు రైల్వే స్టేషన్ల ఆధునీకీకరణ బాధ్యతను ఆయా రైల్వే జోన్ల అధికారులకే అప్పగించారు. ఈసారి బడ్జెట్ లో దక్షిణ మధ్య రైల్వే లోని పలు స్టేషన్లను డెవలప్ చేసేందుకు రూ. 325 కోట్ల నిధులను కేటాయించింది.
ఈ నిధులతో రాష్ట్రంలోని సికింద్రాబాద్ స్టేషన్ తో పాటు… ఏపీలోని తిరుపతి, నెల్లూర్ స్టేషన్లను డెవలప్ చేయనున్నారు. ముఖ్యంగా దక్షిణ భారత దేశంలో రైల్వేకు గుండె కాయగా ఉన్న సికింద్రాబాద్ స్టేషన్ ను మరింతగా అభివృద్ధి చేయనుంది. ఈ మేరకు దక్షిణ మధ్య రైల్వే ఈపీసీ టెంటర్లను కూడా ఆహ్వానించింది. సికింద్రాబాద్ స్టేషన్ ను ఎయిర్ పోర్ట్ మాదిరిగా తీర్చిదిద్దనున్నారు. స్టేషన్ లో పార్కింగ్ మొదలుకుని.. రైలు ఎక్కే వరకు అన్ని వ్యవస్థలను ఆధునీకీకరించనున్నారు. అంతర్జాతీయ స్థాయి వసతులను ఏర్పాటు చేసేలా ప్లాన్ చేస్తున్నారు. ఎయిర్ పోర్ట్ తరహాలోనే షాపింగ్ మాల్స్, రెస్టారెంట్లు, సినిమా హాళ్లు వంటివి ఏర్పాటు చేయనున్నారు. ఈ పనులకు నెలలోపు టెండర్లను పిలిచి.. మూడు నెలల్లో వర్క్ ఆర్డర్లు ఇవ్వాలని భావిస్తున్నారు.
అద్భుత మంత్ర శక్తులతో, మంత్ర రహస్యాలతో, మంత్ర విశేషాలతో మరీ ముఖ్యంగా మహా బలాలకే మహా బలాన్నిచ్చే పరమాద్భుత నృసింహ…
భారత రూపాయి చరిత్రలో ఎన్నడూ లేని స్థాయిలో పతనమవుతోంది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ రోజురోజుకు దిగజారుతూ ఆల్‌టైం…
చలికాలం వచ్చిందంటే చాలు.. చాలా మందికి ఒక విచిత్రమైన అనుభవం ఎదురవుతుంటుంది. కారు డోర్ తీస్తున్నా, కుర్చీలో కూర్చుంటున్నా, కనీసం…
నేటి ఉరుకుల పరుగుల జీవితంలో మానసిక ప్రశాంతతకు, శారీరక దృఢత్వానికి చాలామంది యోగాను ఆశ్రయిస్తున్నారు. అయితే, యోగా చేసేవారిని తరచుగా…
చేపలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయనడంలో సందేహం లేదు. అయితే, చేపలను ఏ ఆహారాలతో కలిపి తింటున్నాం అన్నదే అసలు…
కేంద్రంలోని మోదీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయానికి సిద్ధమవుతోంది. ఇప్పటివరకు అమలులో ఉన్న **మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ…