Aishwarya : చలన చిత్ర రంగంలో స్టార్ ఇమేజ్ ఎపుడు ఉంటుందో ఎపుడు ఉండదో ఎవరికీ తెలియదు. దీపం వున్నప్పుడు మాత్రమే ఇల్లు చక్కపెట్టుకోవాలి అన్నట్టు స్టార్ ఇమేజ్ వున్నప్పుడు మాత్రమే ఆర్థికంగా నిలదొక్కుకోవడం, అవకాశాలు అందుకోవడం చేయాలి. నటీమణుల విషయంలో అయితే స్టార్ ఇమేజ్ గురించి అసలు ఊహించలేము. కొంత మంది ఆర్థిక సమస్యలతో వేరే వేరే వృత్తులతో నెట్టుకొస్తుంటారు. ఇక సినిమా మాత్రమే తెలిసిన వారికి కష్టాలు తప్పట్లేదు. ఎంతటి బ్యాక్ గ్రౌండ్ ఉన్న వాళ్లకు అయినా సినిమా కష్టాలు తప్పవు. ఈ కోవలోకే వస్తారు ప్రముఖ నటి ఐశ్వర్య. ఈమె సీనియర్ హీరోయిన్ అయిన లక్ష్మి కూతురిగా సినిమాల్లో ప్రవేశించినా అవకాశాలు పెద్దగా రాలేదు.
ఒకప్పడు కోలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా తెలుగులో కూడా మంచి నటిగా గుర్తింపు తెచ్చుకున్నప్పిటికీ ప్రస్తుతం అవకాశాలు లేక కష్టపడుతోంది. ఈ మధ్య ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఐశ్వర్య, ఇంటి అవసరాల కోసం తాను పడ్డ కష్టాల గురించి ఎమోషనల్ అయ్యారు.
సినిమా నాకు తిండి పెట్టడం లేదు…
‘పితామగన్’ (శివపుత్రుడు) సినిమాతో ఐశ్వర్య కు మంచి గుర్తింపు వచ్చింది. అయినా ఇప్పుడు సినీ అవకాశాలు లేవు. తాజాగా పాల్గొన్న ఒక ఇంటర్వ్యూలో ఇలా చెప్పారు… నాకు నలుగురు పిల్లలు ఉన్నారు. వాళ్లను పోషించాలంటే నా కాళ్ల మీద నేను నిలబడాల్సిన పరిస్థితి. నాకు కావాల్సిన సమయంలో అవకాశాలు రాలేదు. ఆదాయం లేదు. ఇంటి అవసరాలకు డబ్బు కావాలి. అందుకోసం ఒకప్పుడు సబ్బులు అమ్మి డబ్బులు సంపాదించాను. నాకు అంతకన్నా మంచి జీతం వస్తుందంటే ఇంట్లో పాచి పని చేయటానికి, టాయిలెట్లు క్లీన్ చేయాడానికి కూడా నేను సిద్దమే.
నేను ప్రస్తుతం చేస్తున్న పనిలో నేను ఎంతో సంతోషంగా ఉన్నాను. ఎందుకంటే ప్రస్తుతం నాకు ఇప్పుడు ఎలాంటి అప్పులు లేవు. ఏం సమస్యలు కూడా లేవు. “ప్రస్తుతం కేవలం సీరియల్స్ కారణంగానే నాకు నటిగా గుర్తింపు వస్తోంది. సినిమా నాకు తిండి పెట్టడం లేదు’’. యోగా ప్రాక్టీస్ కారణంగా ఇపుడు రోజుకు ఒక పూట మాత్రమే భోజనం తింటున్నా అన్నారు. ప్రస్తుతం ఐశ్వర్య ఆర్ధిక కష్టాలు సినీ పరిశ్రమల లో వైరల్ అవుతున్నాయి.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…