Movie News

Aishwarya Arjun: ఐశ్వర్య అర్జున్ ఉమాపతిల లవ్ స్టోరీ తెలుసా…వీరి మధ్య ప్రేమ ఎలా పుట్టిందో తెలుసా?

Aishwarya Arjun: యాక్షన్ హీరో అర్జున్ కుమార్తె ఐశ్వర్య ప్రస్తుతం ఇండస్ట్రీలో హీరోయిన్గా కొనసాగుతున్నారు.ఈమె కేవలం మూడు సినిమాలలో మాత్రమే నటించారు. అయితే ఇండస్ట్రీలో హీరోయిన్గా సక్సెస్ అవ్వడం కోసం ఐశ్వర్య ప్రయత్నాలు చేస్తున్నారు అయితే గత రెండు రోజులుగా ఐశ్వర్య గురించి ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఐశ్వర్య ప్రముఖ తమిళ స్టార్ కమెడియన్ తంబి రామయ్య కుమారుడు ఉమాపతి రామయ్యతో ప్రేమలో ఉన్నారని త్వరలోనే వీరి వివాహం జరగబోతుందంటూ వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలలో ఎంతవరకు నిజం ఉందో తెలియదు కానీ ఈ విషయం గురించి ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్ గా మారింది. వీరిద్దరూ కలిసి ఏ సినిమాలోను నటించలేదు కానీ ఎలా ప్రేమలో పడ్డారన్న సందేహం అందరిలోనూ ఉంది.

ఈ క్రమంలోనే వీరిద్దరి మధ్య ప్రేమ ఎలా చిగురించింది అనే విషయానికి వస్తే… హీరో అర్జున్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నటువంటి సర్వైవర్ అనే రియాలిటీ షోలో స్టార్ కంటెస్టెంట్ గా ఉమాపతి పాల్గొన్నారు. ఈ రియాలిటీ షో సమయంలోనే ఐశ్వర్య ఉమాపతి మధ్య పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం ప్రేమగా మారింది.
ఇక ఉమాపతి కూడా కోలీవుడ్ ఇండస్ట్రీలో పలు సినిమాలలో నటిస్తూ హీరోగా కొనసాగుతున్నారు.

ఇకపోతే ఈ ఇద్దరూ ప్రేమలో ఉంటూ వీరి ప్రేమ విషయాన్ని రహస్యంగా కొనసాగిస్తూ వచ్చారు. అయితే అర్జున్ నిర్మించినటువంటి ఆంజనేయస్వామి ఆలయం ప్రారంభోత్సవ కార్యక్రమంలో భాగంగా తంబి రామయ్య కుటుంబ సభ్యులందరూ పాల్గొన్నారు. అయితే ఈ ఆలయ ప్రారంభోత్సవ కార్యక్రమంలో భాగంగా వీరిద్దరూ ప్రేమలో ఉన్నారు అనే విషయాన్ని గ్రహించిన కుటుంబ సభ్యులు వీరి వివాహం చేయడానికి నిశ్చయించారట.

Aishwarya Arjun: వచ్చే ఏడాది వివాహం…


ఈ క్రమంలోనే వీరిద్దరి వివాహం వచ్చే ఏడాది జనవరి లేదా ఫిబ్రవరి నెలలో జరగబోతోందని తెలుస్తుంది. అర్జున్,తంబి రామయ్య ఇద్దరు కూడా స్టార్స్ కావడంతో వీరి పిల్లల వివాహం చాలా ఘనంగా జరగబోతుందని ఇండస్ట్రీ సమాచారం. ప్రస్తుతం ఐశ్వర్య ఉమాపతిల లవ్ స్టోరీకి సంబంధించిన ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

ఊరగాయకు బూజు పట్టిందా? పారేయకండి.. ఈ సులభమైన చిట్కాలతో మళ్లీ తాజాగా మార్చుకోవచ్చు

తెలుగు ఇంటి వంటల్లో ఊరగాయకు ఉన్న స్థానం ప్రత్యేకం. వేడివేడి అన్నంలో ఒక ముద్ద పచ్చడి ఉంటే చాలు, భోజనానికి…

16 hours ago

హోటల్ రూమ్‌లోకి వెళ్లగానే బెడ్ కింద వాటర్ బాటిల్ వేయాలంటున్నారు.. కారణం ఏమిటో తెలుసా?

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పర్యాటకం, ఉద్యోగాలు, వ్యాపార ప్రయాణాలు విపరీతంగా పెరిగిపోయాయి. ఒక నగరం నుంచి మరో నగరానికి, ఒక దేశం…

17 hours ago

నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. బ్యాంక్ ఆఫ్ బరోడాలో 86 మేనేజర్ ఉద్యోగాలు..

ప్రస్తుతం ప్రభుత్వ రంగ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా…

24 hours ago

టీజీ20 లీగ్‌కు రంగం సిద్ధం.. బ్రాండ్ అంబాసిడర్‌గా విజయ్ దేవరకొండ..

తెలంగాణలో క్రికెట్‌కు మరింత ప్రోత్సాహం అందించే లక్ష్యంతో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న టీజీ20 లీగ్ ప్రారంభానికి సర్వం…

1 day ago

వ్యక్తిగత జీవితం గురించి ఓపెన్‌గా మాట్లాడిన విష్ణుప్రియ.. సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారిన వ్యాఖ్యలు

తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్‌గా, నటిగా సుపరిచితమైన విష్ణుప్రియ భీమినేని మరోసారి వార్తల్లో నిలిచారు. టెలివిజన్ షోలు, రియాలిటీ కార్యక్రమాలు,…

1 day ago

సీఎం విజయ్ కీలక నిర్ణయం.. 14 లక్షల మందికి పైగా రైతులకు లబ్ధి..

వ్యవసాయం అనేది దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక. రైతు సంతోషంగా ఉంటేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది. అయితే…

2 days ago