Aishwarya Rai: ప్రపంచ సుందరి ఐశ్వర్యారాయ్ గురించి, ఆమె అందం గురించి ఎంత చెప్పినా తక్కువే. అప్పటికి ఇప్పటికీ ఆమె అందం ఏమాత్రం చెక్కుచెదరలేదు. 50 ఏళ్ల వయసులో కూడా పాతికేళ్ల పడుచు పిల్లలాగా గ్లామర్ మెయింటైన్ చేస్తోంది. ఇటీవల ప్రముఖ దర్శకుడు మణిరత్నం రూపొందించిన పొన్నియన్ సెల్వన్ 2 సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పొన్నియన్ సెల్వన్ 1 తో పాటు ఇటీవల విడుదలైన పొన్నియన్ సెల్వన్ 2 లో కూడా ఐశ్వర్య తన అందం, అభినయంతో ప్రేక్షకులను కట్టిపడేసింది.
ఇటీవల విడుదలైన పొన్నియన్ సెల్వన్ 2 సినిమా మంచి హిట్ టాక్ తో దూసుకుపోతోంది. ఈ క్రమంలో ఈ సినిమా గురించి బాలీవుడ్ హీరో, ఐశ్వర్య రాయ్ భర్త అభిషేక్ బచ్చన్ స్పందించాడు. “పొన్నియన్ సెల్వన్ 2 సినిమా సక్సెస్ అవ్వడం చిత్ర యూనిట్ శ్రమ కళ్ళకు కట్టినట్లు కనిపిస్తోందని, ఈ సినిమాలో ఐశ్వర్య రాయ్ ని చూసి గర్వపడుతున్నాను అంటూ సోషల్ మీడియాలో ద్వారా ప్రశంసలు కురిపించాడు.
ఇలా అభిషేక్ బచ్చన్ చేసిన ట్వీట్ కి ఒక నెటిజన్ స్పందిస్తూ… “ఇప్పటికైనా తెలిసిందిగా నువ్వు ఆరాధ్య ని చూసుకొని ఐశ్వర్యని మరిన్ని సినిమాలు చేయనివ్వు” అంటూ కామెంట్ చేశాడు. నేటిజన్ చేసిన ఈ కామెంట్ కి అభిషేక్ బచ్చన్ స్పందించాడు. ఈ క్రమంలో అభిషేక్ ” నేనేమీ వద్దన్నానా? సార్.. తను ఏం చేయాలనుకున్నా నా అనుమతి అవసరం లేదు. తనకి ఇష్టమైన పనులు చేయాలనుకుంటే తప్పకుండా చేయవచ్చు ” అంటూ అభిషేక్ బచ్చన్ సమాధానం ఇచ్చాడు.
ఇదిలా ఉండగా గత కొంతకాలంగా అభిషేక్ బచ్చన్ ఐశ్వర్య రాయ్ విడాకుల గురించి వార్తలు వినిపిస్తున్న తరుణంలో అభిషేకి ఇలా ఐశ్వర్య నటన గురించి ప్రశంసలు కురిపించడమే కాకుండా తనకు నచ్చిన పని చేయటానికి అభ్యంతరం లేదని చెప్పటం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అంతేకాకుండా ఐశ్వర్య, అభిషేక్ జీవితాంతం ఇలా ఒకరికొకరు తోడుగా కలిసి ఉండాలని వారి అభిమానులు కోరుకుంటున్నారు.
భారత రూపాయి చరిత్రలో ఎన్నడూ లేని స్థాయిలో పతనమవుతోంది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ రోజురోజుకు దిగజారుతూ ఆల్‌టైం…
చలికాలం వచ్చిందంటే చాలు.. చాలా మందికి ఒక విచిత్రమైన అనుభవం ఎదురవుతుంటుంది. కారు డోర్ తీస్తున్నా, కుర్చీలో కూర్చుంటున్నా, కనీసం…
నేటి ఉరుకుల పరుగుల జీవితంలో మానసిక ప్రశాంతతకు, శారీరక దృఢత్వానికి చాలామంది యోగాను ఆశ్రయిస్తున్నారు. అయితే, యోగా చేసేవారిని తరచుగా…
చేపలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయనడంలో సందేహం లేదు. అయితే, చేపలను ఏ ఆహారాలతో కలిపి తింటున్నాం అన్నదే అసలు…
కేంద్రంలోని మోదీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయానికి సిద్ధమవుతోంది. ఇప్పటివరకు అమలులో ఉన్న **మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ…
ప్రపంచం అంతా సోషల్ మీడియాకు బానిసైపోతున్న వేళ… ఆస్ట్రేలియా ఒక చారిత్రక నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ 10 నుంచి అక్కడ…