బచ్చన్ ఫ్యామిలిలో కరోనా కలకలంతో అభిమానుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. నాలుగు రోజుల క్రితం ఐశ్వర్యరాయ్, కూతురు ఆరాధ్య ఇద్దరికీ కరోనా పాజిటివ్ వచ్చిన విషయం తెలిసిందే.. అంతకు ముందే అమితాబ్ బచ్చన్, అభిషేక్ బచ్చన్ కు కూడా కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయింది. అప్పటి నుంచి బిగ్ బి, అభిషేక్ ఇద్దరు హాస్పిటల్ లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. అయితే ఐశ్వర్యరాయ్, ఆరాధ్య మాత్రం హోమ్ క్వారంటైన్ లో ఉండిపోయారు. ఈ విషయాన్ని అభిషేక్ స్వయంగా తన ట్విట్టర్ అకౌంట్ తెలిపారు.
అయితే తాజగా ఐశ్వర్యరాయ్, తన ఆరాధ్య ఇద్దరు హోమ్ క్వారంటైన్ నుంచి హాస్పిటల్ కు షిఫ్ట్ అయ్యారు. హోమ్ క్వారంటైన్ లో ఉంటే సరిపోతుందని అభిషేక్ ట్వీట్ చేసిన తరువాత అభిమానాలు కాస్త ఊపిరి పీల్చుకున్నారు. అయితే నాలుగు రోజులు కావస్తున్నా వీరిలో కరోనా లక్షణాలు తగ్గుముఖం పట్టడం లేదని, కోవిడ్ సంబంధించిన మరిన్ని లక్షణాలు బయటపడటంతో హాస్పిటల్ లో అడ్మిట్ అయ్యారు. ప్రస్తుతం అమితాబ్, అభిషేక్ ట్రీట్మెంట్ తీసుకుంటున్న నానావతి హాస్పిటల్ లోనే వీరిద్దరూ అడ్మిన్ అయ్యారు.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…