Ajay Ghosh : డిడి దూరదర్శన్ లో తన ప్రయాణం మొదలు పెట్టిన అజయ్ ఘోష్ ఆ తరువాత సినిమాల్లోకి వచ్చారు. ‘ప్రస్థానం’ సినిమాతో మొదలు పెట్టి రన్ రాజా రన్, ఎక్స్ప్రెస్ రాజ వంటి చాలా సినిమాల్లో నటించిన అజయ్ కి మంచి గుర్తింపు తెచ్చిపెట్టిన సినిమా ఎక్స్ ప్రెస్ రాజా, విశారనై, అమ్మోరు తల్లి సినిమాలు. ఇక ఈ మధ్య వచ్చిన ‘పుష్ప’ సినిమాలో తన నటనతో మరింత అభిమానులను సంపాదించుకున్నారు. తమిళంలో వచ్చిన ‘విశారనై’ సినిమా తెలుగులో ‘విచారణ’ పేరుతో డబ్ అయింది. ఈ సినిమాతో నటుడుగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు అజయ్ ఘోష్. ఇక పుష్ప సినిమాతో అజయ్ ఘోష్ క్రేజ్ వేరే లెవెల్ కి పోయింది. ఇపుడు మంచి ఆఫర్స్ తో పలు భాషల్లో బిజీ ఆర్టిస్ట్ అయిపోయారు.
విష్ణు కి తెలిస్తే ఇక అంతే…
ప్రస్తుతం తెలుగులో మంచి పాత్రలను చేస్తూ బిజీగా ఉన్న అజయ్ ఘోష్ పాత్రల ఎంపిక విషయంలో జాగ్రత్త పడుతున్నట్లు చెప్పారు. నా కెరీర్ కి ఉపయోగపడే పాత్ర అయితేనే చేస్తున్నట్లు వివరించారు. ఇక మా అసోసియేషన్ లో సభ్యత్వం గురించి ప్రశ్న ఎదురైనపుడు ఇంకా మా అసోసియేషన్ సభ్యత్వం తీసుకోలేదు, ఇపుడు తీసుకోవాలి ఈ విషయం గనుక విష్ణు, మోహన్ బాబుకి తెలిస్తే ఇక అంతే నన్ను ఉతికారేస్తారు అంటూ చమత్కరించారు. పుష్ప సినిమా తరువాత ఏమి ఆలోచించాలో, ఎలా ప్రయాణం కొనసాగించాలో ఏమి అర్థం కావడంలేదు. అందుకే నెమ్మదిగా సినిమాల విషయంలో ఎంపిక చేసుకుంటున్నాను.
ఇక జీవితంలో ఇన్నేళ్ల ప్రయాణంలో నేను తెలుసుకున్న విషయం ఒక్కటే అన్ని బంధాలు అన్ని అనుభవాలు మనకు ఉండాలి కానీ తామరాకు మీద నీటి బొట్టులా సాగిపోతు ఉండాలి, ఎవరినీ నొప్పించకూడదు, ఎవరి మీద ఎక్కువ అంచనాలు పెట్టుకోకూడదు అంటూ చెప్పారు. ఇక రాజకీయాల వైపు వస్తానని, కమ్యూనిజం భావజాలం ఎక్కువగా ఉండటం వల్ల సమాజానికో కళాకారుడిగా ఎంతో కొంత ఉపయోగపడాలని అనుకుంటున్నట్లు తెలిపారు. భవిష్యత్తులో జనసేన లో చేరుతారా అనే ప్రశ్నకు చెప్పలేను ఆ సమయానికి అలా జరగలనుంటే జరుగుతుంది అంటూ చెప్పారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…