Ajith Kumar: కోలీవుడ్ స్టార్ హీరోగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న నటుడు అజిత్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈయన అగ్ర హీరోగా వెలుగుతున్నప్పటికీ ఒక సాధారణ వ్యక్తిగా ఉంటారు. ఇలా ఎంతో సింపుల్ గా ఉన్నటువంటి ఈ హీరోకి విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.ఇకపోతే హీరో అజిత్ ప్రస్తుతం తునివు అనే సినిమా ద్వారా సంక్రాంతి కానుకగా జనవరి 12వ తేదీ ప్రేక్షకుల ముందుకు రానున్నారు.
డైరెక్టర్ హెచ్ వినోద్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా తమిళంతో పాటు తెలుగులో కూడా విడుదల కానుంది. ఈ సినిమా తెలుగులో తెగింపు అనే పేరుతో ప్రేక్షకుల ముందుకు విడుదల అవ్వడానికి సిద్ధమవుతోంది. ప్రస్తుతం చిత్ర బృందం ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో బిజీగా ఉన్నారు. ఇక ఈ సినిమా విడుదల దగ్గర పడటంతో అజిత్ ఇదివరకే తన ఫ్యామిలీతో కలిసి హాలిడే వెకేషన్ వెళ్లారు.
అందరు హీరోల మాదిరిగా అజిత్ ఫ్యామిలీ సోషల్ మీడియాకు చాలా దూరంగా ఉంటారు. ఏదో పలు సందర్భాలలో మాత్రమే ఈయన ఫ్యామిలీకి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి.ఈ క్రమంలోనే తాజాగా వీరి హాలిడే వెకేషన్ కి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇందులో భాగంగా తన భార్య కూతురు అనుష్క, కుమారుడు అద్విక్ తో ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఇక ఈ ఫోటోలలో అజిత్ కుమార్తె అనుష్కను చూసినటువంటి అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అజిత్ కుమార్తె అనుష్క కుందనపు బొమ్మలా ఉందంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం అనుష్క విదేశాలలో ఉన్నత చదువులు చదువుతోంది అయితే ఈమె భవిష్యత్తులో ప్రొడక్షన్ హౌస్ ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఫ్యామిలీ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…