Akash Puri : పూరి జగన్నాథ్ బద్రీ, ఇడియట్, అమ్మ నాన్న ఒక తమిళ అమ్మాయి అలా వరుస హిట్లు ఇక పోకిరి లాంటి బ్లాక్ బస్టర్ హిట్ మహేష్ ను కొత్తగా చూపించి దర్శకుడిగా తన మార్క్ తెలుగు ఇండస్ట్రీ పై వేసాడు. హీరోలను విలన్ షేడ్ తో చూపించడం పూరి స్టైల్. ప్రస్తుతం పూరికి చాలా రోజులుగా సరైన హిట్ లేదు. ఇక పూరి కొడుకు ఆకాష్ హీరో గా ఎంట్రీ ఇచ్చినా ఇంతవరకు చెప్పుకొదగ్గ హిట్ లేదు. ఇక ఆకాష్ తాజాగా ఈటీవీ లో ప్రసారమయ్యే ఆలీతో సరదాగా షోలో సందడి చేసాడు. చైల్డ్ ఆర్టిస్ట్ గా చేయడం వంటి తదితర విషయాలను పంచుకున్నారు.
బుజ్జిగాడు సినిమాలో చెల్లితో లవర్ గా నటించడం…
బుజ్జిగాడు సినిమాలో చిన్నప్పటి ప్రభాస్ పాత్రలో ఆకాష్, త్రిష పాత్రలో చెల్లెలు నటించారు. ఇక ఇలా అన్నా చెల్లెల్లు లవర్స్ గా నటించడం పై స్కూల్ లో ఎలా స్పందించారు అని ఆలీ అడుగగా, అందరూ నవ్వేవారు. మొదట నేను చేయను అని చెప్పినా నాన్న వినలేదు. పెద్దయ్యాక నువ్వు నీ సినిమాలో హీరోయిన్ నే పెళ్లిచేసుకుంటావారా అని చేయించారట. ఇక ఆకాష్ బుజ్జిగాడు సినిమా కంటే ముందు చిరుత సినిమాలో చిన్నప్పటి రామ్ చరణ్ పాత్రను చేసాడు. ఇక సినిమా చూస్తున్నప్పుడు తన తల్లి ఏడ్చేసిందట.
జైల్లో గిన్నె పట్టుకుని అన్నం కోసం వెళ్లడం అది లాక్కొని ఇతరులు అన్నం తిననీయకుండా కొట్టడం లాంటి సన్నివేశాలకు ఏడ్చేసిందట లావణ్య. ఇక ఆకాష్ నేనింతే సినిమాకు ప్రొడక్షన్ బాయ్ గా కూడా పనిచేసాడట. రవితేజకు టీ అందిస్తుంటే ఒరేయ్ నువ్వు టీ ఇవ్వడమేంట్రా బాబు అంటూ ఒళ్ళో కూర్చోబెట్టుకున్నారట. ఇక సెట్స్ లో పని చేసేటపుడు కారవాన్ వద్దకు కూడా పూరి రానిచ్చేవారు కాదట. ఇక ఆకాష్ జిమ్ లో కూడా పనిచేసాడు. ప్రస్తుతం ఆకాష్ పూరి చోర్ బజార్ సినిమా లో నటిస్తున్నాడు.
కర్ణాటక రాష్ట్రంలోని బెళగావి జిల్లాలో చోటుచేసుకున్న ఒక దారుణ ఘటన కుటుంబాల్లో పెరుగుతున్న అసహనం ఎంత ప్రమాదకరంగా మారుతుందో మరోసారి…
సినీ దర్శకుడు పూరి జగన్నాథ్ తన కొత్త పాడ్‌కాస్ట్‌లో మరోసారి తనదైన స్టైల్‌లో ఆలోచింపజేసే విషయాలను ప్రస్తావించారు. ‘సైన్స్ అండ్…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన కెరీర్‌లోనే కాకుండా వ్యక్తిగత జీవితంలోనూ లగ్జరీకి ప్రాధాన్యత ఇస్తున్నట్లు మరోసారి రుజువైంది. ఇప్పటికే…
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర్ రావు కన్నుమూశారు. 90 ఏళ్ల వయసులో ఆయన బుధవారం ఉదయం తుదిశ్వాస…
తెలుగు సినీ పరిశ్రమపై ఎప్పుడూ ముక్కుసూటిగా మాట్లాడే నటుడు జేడీ చక్రవర్తి తాజాగా మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు.…
సినిమా రంగంలో నటీనటుల కష్టాలు, అంకితభావం గురించి తరచూ వినిపిస్తుంటుంది. అయితే కొంతమంది స్టార్ హీరోయిన్లు తమ పనిపై చూపించే…