Akash Puri About Adipurush Movie : దర్శకుడు పూరీ జగన్నాథ్ వారసుడు ఆకాష్ పూరీ హీరోగా చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆకాష్ పూరీ హీరోగా చోర్ బజార్ సినిమా రాబోతోంది. చోర్ బజార్ మూవీ జూన్ 24న ప్రేక్షకులకు ముందుకు రాబోతుంది. ప్రస్తుతం ఆకాష్ సినిమా ప్రమోషన్ లలో బిజీ గా వున్నారు. ఈ క్రమంలోనే ఆకాష్ ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ ఇంటర్వ్యూలో తన సినిమా విశేషాలతో పాటు ప్రభాస్ ఆదిపురుష్ సినిమా విశేషాలు చెప్పి ఫాన్స్ ని ఖుషి చేశారు.
ఆదిపురుష్ లో డార్లింగ్ మాములుగా లేడు…
సినీ నటినటులు అపుడప్పుడు ఇంటర్వ్యూలలో వారి సినిమాల గురించి తోటి నటుల సినిమాల గురించి ముందే చెప్తూ అభిమానులను ఆనందపరుస్తుంటారు. ఈ క్రమంలోనే ఆకాష్ డార్లింగ్ రాబోయే సినిమా ఆదిపురుష్ గురించి లీక్ చేశారు. ఇండస్ట్రీలో డార్లింగ్ ప్రభాస్ కి పూరీ జగన్నాథ్ ఫ్యామిలీకి మంచి సంబంధం వున్న సంగతి తెలిసిందే. ఆకాష్ హీరో గా వచ్చిన రొమాంటిక్ సినిమాను ప్రభాస్ ఏ రేంజలో ప్రమోట్ చేశారో అందరికి తెలిసిందే. చిత్ర బృందాన్ని ప్రత్యేకంగా ఇంటర్వ్యూ కూడా చేశారు డార్లింగ్.
రొమాంటిక్ సినిమా ప్రమోషన్ సమయంలో ప్రభాస్ మాతో రోజంతా గడిపారని ఆకాష్ చెప్పాడు. అంతే కాదు అపుడు ఆదిపురుష్ సినిమాకు సంబంధించిన కొన్ని విజుయల్స్ చూపించారని, ఆ విజువల్స్ లో ప్రభాస్ మాములుగా లేడు. ఫ్యాన్స్ కి విజువల్ ట్రీట్ ఓ రేంజిలో ఉంటుందంటూ ఫాన్స్ కి పండగ లాంటి వార్త చెప్పారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…