బుల్లితెర అతిపెద్ద రియాల్టీ షోలలో ఒకటైన “బిగ్ బాస్ ” పలు సీజన్లతో దూసుకుపోతూ ఎంతటి ప్రజాదరణ పొందిందో మనందరికీ తెలిసిందే.అలాగే ఈ షో ద్వారా ఎంతో మంది ఆర్టిస్టులు ఇండస్ట్రీలో వరుస అవకాశాలతో దూసుకుపోతూ పాపులర్ అయ్యారు. గత ఏడాది గ్రాండ్ సక్సెస్ అయిన బిగ్ బాస్ నాలుగో సీజన్‌లో ఎంట్రీ ఇచ్చిన పంజాబీ బ్యూటీ మోనాల్ గజ్జర్ మరియు మోస్ట్ డిజైరబుల్ మ్యాన్ అఖిల్ సార్థక్ తమ ప్రేమ వ్యవహారంతో ఎంతో పాపులర్ అయిన విషయం తెలిసిందే.
బిగ్ బాస్ హౌస్‌లో హల్‌చల్ చేసిన ప్రేమ జంట మోనాల్ గజ్జర్,అఖిల్ సార్థక్ తమ ప్రేమ వ్యవహార శైలితో నిత్యం సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో నిలుస్తూ మరింత పాపులర్ అయ్యారు. ఈ షో తర్వాత వీరిద్దరూ వరుస అవకాశాలతో బిజీగా ఉంటున్నారు.ఈ మధ్యనే
మోనాల్ గజ్జర్ అఖిల్ సార్థక్‌తో కలిసి నటిస్తున్న “తెలుగు అబ్బాయి గుజరాత్ అమ్మాయి”అనే వెబ్ సిరీస్‌ను ప్రకటించింది. దీన్ని సరస్వతి క్రియేషన్స్ బ్యానర్‌పై భాస్కర్ బంతుపల్లి తెరకెక్కిస్తున్నారు. దీనికి సంబంధించిన పోస్టర్‌ను కూడా విడుదల చేసిన విషయం తెలిసిందే.
సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే అఖిల్ సార్థక్ తాజాగా మోనాల్‌పై సోషల్ మీడియా వేదికగా సంచలన వ్యాఖ్యలు చేసి అందర్నీ ఆశ్చర్యపరిచాడు. అఖిల్, మోనాల్ తాజాగా వీడియో కాల్ మాట్లాడుకున్నారు. దీనికి సంబంధించిన స్క్రీన్ షాట్‌ను షేర్ చేస్తూ
హాహా క్యూటీ ..ఏమైంది నీకు.. డ్రామా క్వీన్ అని స్క్రీన్ షాట్ పై రాసుకొచ్చాడు.దీనికితోడు ఈ పిక్‌లో మోనాల్ ఎంతో కోపంగా కనిపించడంతో వీరి ప్రేమ వ్యవహారం పై అనేక సందేహాలు కలిగిస్తూ ఉండడంతో ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో పలువురు నెటిజెన్స్ ఈ పిక్ పై వినూత్నంగా స్పందిస్తున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…