డ్రామా క్వీన్ అంటూ ..మోనాల్ పై సంచలన వ్యాఖ్యలు చేస్తూ ఆ ఫోటో లీక్ చేసిన అఖిల్!

0
286

బుల్లితెర అతిపెద్ద రియాల్టీ షోలలో ఒకటైన “బిగ్ బాస్ ” పలు సీజన్లతో దూసుకుపోతూ ఎంతటి ప్రజాదరణ పొందిందో మనందరికీ తెలిసిందే.అలాగే ఈ షో ద్వారా ఎంతో మంది ఆర్టిస్టులు ఇండస్ట్రీలో వరుస అవకాశాలతో దూసుకుపోతూ పాపులర్ అయ్యారు. గత ఏడాది గ్రాండ్ సక్సెస్ అయిన బిగ్ బాస్ నాలుగో సీజన్‌లో ఎంట్రీ ఇచ్చిన పంజాబీ బ్యూటీ మోనాల్ గజ్జర్ మరియు మోస్ట్ డిజైరబుల్ మ్యాన్ అఖిల్ సార్థక్ తమ ప్రేమ వ్యవహారంతో ఎంతో పాపులర్ అయిన విషయం తెలిసిందే.

బిగ్ బాస్ హౌస్‌లో హల్‌చల్ చేసిన ప్రేమ జంట మోనాల్ గజ్జర్,అఖిల్ సార్థక్ తమ ప్రేమ వ్యవహార శైలితో నిత్యం సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో నిలుస్తూ మరింత పాపులర్ అయ్యారు. ఈ షో తర్వాత వీరిద్దరూ వరుస అవకాశాలతో బిజీగా ఉంటున్నారు.ఈ మధ్యనే
మోనాల్ గజ్జర్ అఖిల్ సార్థక్‌తో కలిసి నటిస్తున్న “తెలుగు అబ్బాయి గుజరాత్ అమ్మాయి”అనే వెబ్ సిరీస్‌ను ప్రకటించింది. దీన్ని సరస్వతి క్రియేషన్స్ బ్యానర్‌పై భాస్కర్ బంతుపల్లి తెరకెక్కిస్తున్నారు. దీనికి సంబంధించిన పోస్టర్‌ను కూడా విడుదల చేసిన విషయం తెలిసిందే.

సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే అఖిల్ సార్థక్‌ తాజాగా మోనాల్‌పై సోషల్ మీడియా వేదికగా సంచలన వ్యాఖ్యలు చేసి అందర్నీ ఆశ్చర్యపరిచాడు. అఖిల్, మోనాల్ తాజాగా వీడియో కాల్ మాట్లాడుకున్నారు. దీనికి సంబంధించిన స్క్రీన్ షాట్‌ను షేర్ చేస్తూ
హాహా క్యూటీ ..ఏమైంది నీకు.. డ్రామా క్వీన్ అని స్క్రీన్ షాట్ పై రాసుకొచ్చాడు.దీనికితోడు ఈ పిక్‌లో మోనాల్ ఎంతో కోపంగా కనిపించడంతో వీరి ప్రేమ వ్యవహారం పై అనేక సందేహాలు కలిగిస్తూ ఉండడంతో ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో పలువురు నెటిజెన్స్ ఈ పిక్ పై వినూత్నంగా స్పందిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here