Featured

Akira Nandan: ప్రభాస్ పాట వింటూ వర్కౌట్స్ చేస్తున్న పవన్ కొడుకు… వీడియో షేర్ చేసిన రేణు దేశాయ్!

Akira Nandan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రేణు దేశాయ్ ల కుమారుడు అకిరా నందన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పవన్ కళ్యాణ్ రేణు దేశాయ్ ఇద్దరు విడిపోవడంతో పిల్లలు తన తల్లి వద్ద పెరుగుతున్నారు. ప్రస్తుతం అకిరా నందన్ విదేశాలలో ఉన్నత చదువులు చదువుకుంటూ ఉన్నారు. ఇక సోషల్ మీడియాకు అకిరా దూరంగా ఉన్నప్పటికీ తన తల్లి రేణు దేశాయ్ మాత్రం ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన విషయాలను అభిమానులతో పంచుకుంటారు.

ఇలా సోషల్ మీడియా వేదికగా అకీరాకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకొనే రేణు దేశాయ్ తాజాగా తన కొడుకు జిమ్లో భారీగా వర్కౌట్ చేస్తున్నటువంటి వీడియోని షేర్ చేశారు.ఈ వీడియోలో భాగంగా మొహం కనిపించకపోయినప్పటికీ తను వేసుకున్న టీ షర్ట్ వెనుక భాగంలో ఆంజనేయస్వామి ఉన్నట్టు తెలుస్తోంది. ఇక ఈ వీడియోని ఈమె షేర్ చేసారు.

సాధారణంగా జిమ్ లో వర్కౌట్స్ చేసే సమయంలో తమ్ముడు సినిమాలోని ‘ట్రావెలింగ్ సోల్జర్’ సాంగ్ ని బాగా వింటుంటాం. కానీ పవన్ తనయుడు అకీరా మాత్రం జిమ్ లో వర్క్ అవుట్ చేస్తూ ప్రభాస్ సాంగ్ వింటూ ఉన్నారు. బాహుబలి 2 సినిమాలోని ‘ఒక ప్రాణం’ అనే సాంగ్ ని వింటున్నాడు.


Akira Nandan: గర్వంగా ఉంది…


ఇక ఈ వీడియోని రేణు దేశాయ్ సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ.. జిమ్ చేసేటప్పుడు అర్థం లేని ఇంగ్లీష్ పాటలు వినడం కన్నా ఇలా తెలుగు పాటలు హిందీ పాటలు వింటున్నందుకు చాలా గర్వంగా ఉంది మై లిటిల్ బాయ్ అంటూ ఈమె ఈ వీడియోని షేర్ చేసారు ఇది చూసినటువంటి పవన్ ఫ్యాన్స్ ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

2 days ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

3 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

3 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

3 months ago