Featured

Rakesh master friend Aleti Atam : ఆ పనిమనిషి రాకేష్ మాస్టర్ ను చెప్పుతో కొట్టింది…: రాకేష్ మాస్టర్ సన్నిహితుడు ఏలేటి ఆటం

Rakesh master friend Aleti Atam : సినిమా ఇండస్ట్రీలో డాన్స్ మాస్టర్ గా మొదలయి దాదాపు 1500 సినిమాలకు డాన్స్ కంపోజ్ చేసిన రాకేష్ మాస్టర్ అసలు పేరు రామారావు. ప్రస్తుతం టాప్ డాన్స్ మాస్టర్లు గా ఉన్న శేఖర్ మాస్టర్, జానీ మాస్టర్లు ఈయనకు శిష్యులు. చిరునవ్వుతో, లాహిరి లాహిరి లాహిరిలో, దేవదాసు, సీతయ్య వంటి సినిమాలకు కోరియోగ్రఫీ చేసిన రాకేష్ మాస్టర్ ఢీ షో ద్వారా మరింత క్రజ్ తెచ్చుకున్నాడు. ఇక జబర్దస్త్ లో అడపాదడపా కనిపించేవాడు. అయితే వైజాగ్ నుండి షూటింగ్ కోసం వెళ్లి హైదరాబాద్ తిరిగిగివచ్చిన రాకేష్ మాస్టర్ అనారోగ్యంతో గాంధీ హాస్పిటల్ లో చికిత్స తీసుకుంటూ జూన్ 17 నాడు కన్నుమూశారు. ఇక ఆయన గురించి ఆయన స్నేహితుడు ఏలేటి అటం మాట్లాడారు.

ఆమె రాకేష్ మాస్టర్ కొట్టింది…

రాకేష్ మాస్టర్ కి రెండేళ్ల క్రితమే ఆరోగ్యం పాడైపోయింది. ఆయనకు లివర్ పాడై పోయింది. అందుకు ముఖ్యంగా మానసిక ప్రశాంతత అలాగే మంచి ఆహరం అలవాట్లు ఉంటేనే కోలుకుంటారని చెప్పారు. కానీ రాకే్స్ మాస్టర్ కి అలాంటి పరిస్థితులు లేవు. ఆ జబ్బు వల్లే ఆయన నోటికి ఎలా పడితే అలా అందరినీ మాట్లాడటం, తిట్టడం చేసేవాడు. ఇక మందు అలవాటు మానక పోవడం వల్ల ఇబ్బందులను ఎదుర్కొన్నాడు. కృష్ణ నగర్ లో ఒక రూమ్ లో ఉండే సమయంలో ఆయనకు వంట చేయడానికి అని వచ్చిన లక్ష్మి అనే మహిళ వల్ల చాలా మానసికంగా క్రుంగిపోయాడు. మొదట్లో బయటి నుండి వచ్చి వంట చేసి వెళ్ళేది. ఇక ఆయన లేచిన వెంటనే సొరకాయ జ్యూస్ లాంటివి తాగేవాడు. అందుకే కష్టమవుతుందని ఆమె ఆయన ఉన్న దగ్గరే వేరే రూమ్ లో ఉండేది. ఇద్దరి మధ్య ఎలాంటి బంధం లేదు. అందువల్ల చాలా మంది రకరకాలుగా అనుకున్నారు. అయితే ఆయన చేసిన తప్పు ఆమెకు యూట్యూబ్ ఛానెల్ పెట్టించడం. మాస్టర్ ఎంతో మందికి ఛానెల్ పెట్టించాడు. అలా ఆమెకు కొంత సహాయ పడుతుందని ఛానెల్ పెట్టించాడు. సహజీవనం అంటే మీనింగ్ తెలియయకుండానే ఆమెతో ఉన్నానని అలా చెప్పడంతో జనాల్లోకి తప్పుగా వెళ్ళింది. ఇక మాస్టర్ కి జబ్బు ఉండటం వల్ల విపరీతమైన కోపం, తిట్టడం చేసేవాడు.

ఆమెను కూడా ఒకసారి అలానే తిట్టేసరికి ఆమె చెప్పుతో కొట్టింది. ఆ సంఘటన తరువాత ఆశ్రమం దగ్గరికి వచ్చేసాడు. ఆ తరువాత మరింత క్రుంగిపోయాడు. అయితే ఆశ్రమం వచ్చాక ఆహారపు అలవాట్లు తాగుడు మన్పించడానికి ప్రయత్నించాం. కానీ ఆయన అభిమానులంటూ ఆయనను షూటింగ్స్ తీసుకెళ్లి ఏవేవో తినిపించి బాగా తాగించే సరికి ఆయన చనిపోయారు. షుగర్ ఎక్కువగా ఉంది అప్పటికే అలాంటి సమయంలో మామిడి పళ్ళు బాగా తినేసాడు, ఇక మందు మోతదుకి మించి తాగడం వల్ల లివర్ గడ్డకట్టుకుపోయింది, అలాగే ఆహారనాళం వద్ద రక్త నాళాలు చిట్లి పోయి రక్తం వాంతులు అయ్యాయి అంటూ బాధపడ్డారు.

Bhargavi

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago