Featured

Kota Srinivasa Rao : ఇపుడు ఎంతమంది హీరోలు ఉన్నారు… బిల్డ్ అప్ ఎక్కువ… కంటెంట్ తక్కువ…: నటుడు కోటా శ్రీనివాస రావు

Kota Srinivasa Rao : విలనిజంలో కొత్త స్టైల్ చూపిన విలక్షణ నటుడు కోటా శ్రీనివాసరావు గారు. ఆయన కమెడియన్ గాను, విలన్ గాను, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గాను ఇలా ఎన్నో షేడ్స్ ఉన్న పాత్రల్లో ఒదిగిపోయి ఎంతోమంది తెలుగు ప్రేక్షకులకు మనస్సులో స్థానాన్ని సంపాదించుకున్నారు. ఇక కోటా గారు సినిమాల్లోకి వచ్చేకన్నా ముందే బ్యాంకులో ఉద్యోగిగా ఉండేవారు. కొన్నేళ్లు బ్యాంకులో ఉద్యోగం చేస్తూనే సినిమాలను చేస్తూ రెండింటి మీద ప్రయాణం చేసారు. ఇక సినిమాల్లో మెల్లగా స్థిరపడిపోయాక ఉద్యోగం మానేసి పూర్తిగా సినిమాల్లో నటించారు. అలా సౌత్ భాషలలో నటించిన ఆయన ప్రస్తుతం వృద్ధాప్య సమస్యలతో బాధపడుతూ సినిమాల్లో నటించడం లేదు. అయితే పలు ఇంటర్వ్యూల్లో పాల్గొంటూ ఆయన సినిమా కెరీర్ విశేషాలను చెబుతుంటారు.

ఇప్పటి జెనరేషన్ లో ఎంత మంది హీరోలు ఉన్నారు…

కోటా శ్రీనివాస రావు గారు అయన అభిప్రాయాలను ముక్కుసూటిగా చెప్పేస్తుంటారు. ఈ మధ్య కాలంలో ఆయన ఇంటర్వ్యూలు బాగా వైరల్ అవుతున్నాయి. ఎక్కువగా పాత సినిమా టెక్నిషియన్స్ తో కొత్త సినిమాలను పోలుస్తూ ఆయన విమర్శిస్తుంటారు. ఒకప్పటి ‘మాయాబజార్’, విఠలాచార్య సినిమాల కంటే గొప్పగా సినిమాలు ఇపుడు ఏవీ లేవు అంటూ చెప్పే ఆయన హీరోల గురించి మాట్లాడుతూ ఇప్పుడు పైకి 30 మంది దాక హీరోలు ఉన్నా కనిపించేది అభిమానులుండేది ఐదరుగురు హీరోలకే అంటూ చెప్పారు.

అలాగే ఇప్పుడు డైరెక్టర్స్ అంటూ ఎవరూ లేరు. ఒక ఐదరుగురు పేర్లే వినిపిస్తాయి. సినిమా ఇండస్ట్రీలో హీరోలు ఆ ఐదరుగురు డైరెక్టర్లతోనే సినిమాలను చేస్తుంటారు. బడ్జెట్లు, టెక్నాలజీ అంటూ సినిమా తీసామని గొప్పలు చెబుతారు, బిల్డ్ అప్ ఎక్కువ కంటెంట్ తక్కువ నేటి సినిమాలలో అంటూ కోటా శ్రీనివాస రావు గారు అభిప్రాయపడ్డారు.

Bhargavi

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago