Arjun Daughter: యాక్షన్ హీరోగా ఇండస్ట్రీలో ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి తెలుగు తమిళ కన్నడ భాషలలో ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించి హీరోగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. ఇలా నటుడుగా ఇండస్ట్రీలో కొనసాగుతున్నటువంటి ఈయన ఇప్పటికీ పలు సినిమాలలో సపోర్టింగ్ పాత్రలలో నటిస్తూ ప్రేక్షకులను సందడి చేస్తున్నారు.
ఇకపోతే ఈయన కుమార్తె ఐశ్వర్య ఇండస్ట్రీ లోకి హీరోయిన్ గా అడుగుపెట్టిన విషయం మనకు తెలిసిందే. ఇప్పటికే మూడు సినిమాలలో నటించినటువంటి ఈమె ఇండస్ట్రీలో హీరోయిన్ గా గుర్తింపు పొందడం కోసం ప్రయత్నాలు చేస్తున్నారు.ఇదివరకే కన్నడ తమిళ భాషలలో నటించిన ఐశ్వర్య తెలుగులో కూడా నటించే అవకాశం వచ్చినప్పటికీ కొన్ని కారణాలవల్ల ఆ సినిమా ఆగిపోయింది.
ఇకపోతే తాజాగా ఐశ్వర్య గురించి ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. నటి ఐశ్వర్య త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్నారని సమాచారం. నటిగా ఇండస్ట్రీలో కెరియర్ మొదలు పెట్టిన తరుణంలోని ఈమె పెళ్లి చేసుకోబోతున్నారని తెలిసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. మరి ఈమె పెళ్లి చేసుకోబోయే ఆ వ్యక్తి ఎవరు ఏంటి అనే విషయానికి వస్తే..
ఐశ్వర్య కోలీవుడ్ కమెడియన్ తంబి రామయ్య కుమారుడు ఉమాపతితో గత కొంతకాలంగా ప్రేమలో ఉన్నారంటూ వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే ఉమాపతితో కలిసి ఈమె పెళ్లి పీటలు ఎక్కబోతున్నారని తెలుస్తుంది. ఈ విధంగా ఉమాపతితో ఐశ్వర్య గత కొంతకాలంగా ప్రేమలో ఉన్నారని అందుకే పెద్దల అనుమతితో వివాహం చేసుకోవడానికి సిద్ధమయ్యారని తెలుస్తుంది.ఇక ఉమాపతి కూడా ఇండస్ట్రీలో హీరోగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. దీంతో వీరిద్దరి పెళ్లి గురించి ప్రస్తుతం సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…