Poonam Kaur: నటి పూనమ్ కౌర్ సినిమాలలో కొన్ని వివాదాల ద్వారానే ఎంతో ఫేమస్ అయ్యారు.ఇలా నిత్యం ఏదో ఒక వివాదంతో వార్తల్లో నిలిచే పూనమ్ కౌర్ గత మూడు రోజుల నుంచి వరుస హిట్లతో సోషల్ మీడియా వార్తలలో నిలుస్తుస్తున్నారు.ఈ క్రమంలోనే ఏపీ ముఖ్యమంత్రిని కలవడం కోసం సినీ పెద్దలు వెళ్లి ఆయన ముందు చేతులు పట్టుకొని నిలుచుని మీ వ్యక్తిత్వాన్ని చంపుకోవద్దు అంటూ ఈమె సంచలనమైన ట్వీట్ చేశారు.
ఇదిలా ఉండగా ప్రీ రిలీజ్ వేడుకలో భాగంగా పవన్ గురించి వర్మ చేసిన కామెంట్లపై కూడా ఈమె స్పందిస్తూ మహిళలను ఆయుధాలుగా వాడుకుంటున్నారు అంటూ ట్వీట్ చేశారు. ఇదిలా ఉండగా తాజాగా ఈ సినిమా విడుదలైన తర్వాత పూనమ్ కౌర్ మరోసారి ఈ సినిమాపై ఓ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.
తాజాగా పూనమ్ కౌర్ వాట్సప్ చాట్ కి సంబంధించిన ఒక స్క్రీన్ షాట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ క్రమంలోనే స్క్రీన్ షాట్ లో ఒక వ్యక్తి ఏదో స్టేటస్ పెట్టుకుని ఉండగా మరొక వ్యక్తి వాట్ ఇన్ అని అడుగగా ఆ వ్యక్తి సినిమాకొచ్చా అక్క… బావ సినిమా ఉదయం ఎనిమిది గంటలకు స్టార్ ఎమోజీలను రిప్లైగా ఇచ్చారు. ఇక వాటికి సిగ్గుపడుతున్నట్టుగా నిజాయితీగా సినిమా రివ్యూ చెప్పమని అడుగుతారు.సరే అంటూ అవతలి వ్యక్తి రిప్లై ఇచ్చాడు.
అక్క సినిమా హిట్ నన్ను నమ్మండి ప్రామిస్ గా చెబుతున్నా అంటూ రిప్లై ఇచ్చాడు. ఇక ఈ వాట్సప్ చాట్ కి సంబంధించిన స్క్రీన్ షాట్ పూనమ్ షేర్ చేయడంతో ఇది కాస్త చర్చనీయాంశంగా మారింది.ఈ క్రమంలోనే ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో అసలు ఈ అక్క ఎవరు.. తమ్ముడు ఎవరు.. అసలు బావ ఎవరు అంటూ పెద్ద ఎత్తున చర్చ మొదలు పెట్టారు. ఏది ఏమైనా పూనమ్ కౌర్ ఒక ట్వీట్ చేసినా లేదా పోస్ట్ పెట్టిన అది ఎవరి గురించి అని తెలుసుకోవడం కోసం నెటిజన్లు ఎన్నో తంటాలు పడుతుంటారు.మొత్తానికి ఈమె షేర్ చేసిన స్క్రీన్ షాట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…