అక్కినేని అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న చిత్రం ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’. దీనిలో అఖిల్, పూజా హెగ్డే హీరో హీరోయిన్లు కాగా.. దీనికి బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే. రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ గా వస్తున్న ఈ సినిమా ట్రైలర్ ను తాజాగా విడుదల చేశారు.
ఎంతోకాలంగా హిట్ కోసం ఎదురుచూస్తున్న అఖిల్ కు ఈ చిత్రం సక్సెస్ ఇచ్చేలా అంచనాలు పెంచింది ట్రైలర్. లవ్, కామెడీ అంశాలతో ఆసక్తిగా రేకెత్తించగా.. అఖిల్, పూజా హెగ్డే జోడీ స్క్రీన్ ఫెయిర్ బాగుంది. మన లైఫ్ పార్ట్‌నర్‌తో కనీసం 9000 నైట్స్ కలిసి పడుకోవాలి. వందల వెకేషన్స్‌కు వెళ్లాలి. అన్నిటికీ మించి కొన్ని లక్షల కబుర్లు చెప్పుకోవాలి.
అలాంటి వాడు ఎవడు అనే పూజా హెగ్దే ప్రశ్నతో ట్రైలర్ స్టార్ట్ అవుతుంది. ‘ఒక అబ్బాయి లైఫ్‌లో 50 పర్సెంట్ కెరీర్, 50 పర్సెంట్ మ్యారీడ్ లైఫ్. మ్యారీడ్ లైఫ్ బాగుండాలంటే కెరీర్ బాగుండాలి’ అనే అఖిల్ డైలాగ్ వెంటనే వస్తుంది. ఈ రెండు డైలాగ్ లు ఎంతగానో ఆకట్టుకున్నాయి. మ్యారీడ్ లైఫ్ బాగుండాలంటే కెరీర్ బాగుండాలి అంటూ అఖిల్ చెప్పే డైలాగ్స్ హృదయాన్ని తాకేలా ఉన్నాయి.
ఇక పూజా హెగ్డే, అఖిల్ కు పూర్తి భిన్నంగా ఉన్నట్లు ట్రైలర్ బట్టి తెలుస్తోంది. ఇక ట్రైలర్ మధ్యలో జాతిరత్నాలు ఫేమ్ ఫరియా, ఈషా రెబ్బా కనిపించారు. ఇందులో కాస్త కామెడీ, కాస్త రొమాన్స్‌ను ట్రైలర్‌లో చూపించారు. అయితే ఈ సినిమా ఎప్పుడో విడుదల కావాల్సింది.. కానీ వాయిదాలు పడుతూ వచ్చింది. చివరకు దీనిని అక్టోబర్ 15 న దసరా కానుకగా విడుదల చేయనున్నారు.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…