అక్కినేని నాగేశ్వరరావు… ఈయన తెలియని తెలుగు ప్రేక్షకుడు ఉన్నారంటే అది నిజంగా ఆశ్చర్యమే. దానికి కారణం ఆయన నట వారసత్వం. అక్కినేని నాగేశ్వరావు గారు సెప్టెంబర్ 20 1924 సంవత్సరంలో జన్మించారు. ఆయన వరి చేలలో నుండి నాటకరంగం ద్వారా కళారంగంలోకి వచ్చిన వ్యక్తి నాగేశ్వరావు. అలనాటి తెలుగు సినిమా రోజులలో అగ్ర కథానాయకులలో ఈయన ఒకరు. ఈయన మొదట్లో స్త్రీ పాత్రల ద్వారా మంచి ప్రాముఖ్యం పొందారు. ఇకపోతే ఈయన నటించిన సినిమాలకు గాను మూడుసార్లు ఉత్తమ నటుడిగా ఫిలింఫేర్ అవార్డును అందుకున్నారు ఈయన. అంతేకాకుండా భారతీయ సినిమా రంగంలో చేసిన కృషికి భారత దేశ పౌరులకి ఇచ్చే రెండవ అతి పెద్ద పురస్కారమైన పద్మ విభూషణ్ తో పాటు భారత సినీరంగంలో జీవిత సాఫల్య పురస్కారమైన దాదా సాహెబ్ ఫాల్కే అవార్డును కూడా ఆయన అందుకున్నారు.
ఇక చిన్నప్పటి నుంచే నాటకాల మీద ఉన్న ఆసక్తితోనే 1947 సంవత్సరంలో పి. పుల్లయ్యగారి దర్శకత్వంలో వచ్చిన ధర్మపత్ని చిత్రం ద్వారా బాలనటిగా నాగేశ్వరావు గారు పరిచయమయ్యారు. ఇక ఆ తర్వాత 1944వ సంవత్సరంలో ఘంటసాల బలరామయ్యగారు తెరకెక్కించిన సీతారామజననం అనే సినిమా ద్వారా పూర్తి స్థాయి కథా నాయకుడిగా ఆయన నటించారు. ఇకపోతే ఆయన తెలుగు, తమిళ, హిందీ భాషల్లో మొత్తం కలిపి 256 సినిమాల్లో నటించడం జరిగింది. ఇక ఆయన నటించిన ఆఖరి చిత్రం మనం సినిమా. తెలుగు సినిమా చరిత్రలో మొట్టమొదటి డ్యూయల్ రోల్ చేసిన వ్యక్తి ఈయనే.
ఇకపోతే ఆయన చివరి రోజుల్లో ఆయనకు ఓపెన్ హార్ట్ సర్జరీ చేయడం జరిగింది. అది కూడా ఆయన అమెరికా దేశం వెళ్లి చాలా రోజులు ఉండి తన ఆరోగ్యాన్ని మెరుగు పరుచుకుని భారత దేశానికి తిరిగి వచ్చారు. అయితే ఆ ఓపెన్ హార్ట్ సర్జరీ చేయడం వల్ల డాక్టర్ల సూచన మేరకు ఆయన సినిమా రంగానికి ఒకింత దూరమయ్యారని చెప్పవచ్చు. దానికి కారణం ఓపెన్ హార్ట్ సర్జరీ అంటే ఏకంగా తన శరీరంలోని రక్తాన్ని మొత్తాన్ని శుద్ధి చేసి మరో రక్తం ఎక్కించుకొని తనకు పునర్జన్మ సాధించారని చెప్పవచ్చు. అయితే ఆ ఆపరేషన్ తర్వాత నిజంగా ఆయన చాలా వరకు సినీ జీవితాన్ని వదిలేశారని చెప్పవచ్చు. ఇకపోతే ఆయన నట వారసత్వంగా ఆయన కుటుంబంలో నుంచి తన తనయుడు అక్కినేని నాగార్జున అగ్ర హీరోలలో ఒకడుగా కొనసాగుతున్నారు. అంతే కాకుండా ఆయన మనవళ్ళు అయిన నాగ చైతన్య, అఖిల్, సుశాంత్, సుమంత్ కూడా సినిమారంగంలో హీరోగా కొనసాగుతున్న సంగతి అందరికీ తెలిసిందే.
అంతేకాకుండా ఈయన తెలుగు చిత్ర పరిశ్రమ హైదరాబాద్ కు తరలించడంలో ప్రముఖ పాత్ర పోషించారు. హైదరాబాద్ కి తెలుగు సినిమా పరిశ్రమ వచ్చాక అన్నపూర్ణ స్టూడియోస్ ను నిర్మించి అనేక సినిమాల నిర్మాణాలలో ఆ స్టూడియో పాలుపంచుకుంది. ఇక చివరికి ఆయన 91 సంవత్సరాల వయసులో జనవరి 22, 2014 సంవత్సరంలో అర్ధరాత్రి దాటాక ఆయన ఊపిరి తీసుకోవడానికి ఇబ్బంది పడుతుండటంతో హాస్పిటల్ కి తీసుకెళ్లగా కోలుకోలేక చనిపోయారు.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…