Ali: తెలుగు సినిమా ఇండస్ట్రీలో కమెడియన్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న ఆలీ వైఎస్ఆర్సిపీ ప్రభుత్వానికి మద్దతుగా గత ఎన్నికలలో పెద్ద ఎత్తున పార్టీ ప్రచార కార్యక్రమాలలో పాల్గొని పార్టీ విజయానికి తన వంతు కృషి చేసిన విషయం మనకు తెలిసిందే.అయితే అధికారంలోకి జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత తన పార్టీ కోసం కష్టపడిన వారందరి సేవలను గుర్తించి వారికి ఏదో ఒక పదవిని అందిస్తూ వచ్చారు.
ఈ క్రమంలోనే వైసీపీ పార్టీకి మద్దతు తెలిపినటువంటి ఆలీ గురించి ప్రభుత్వం మర్చిపోయిందంటూ పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. ఇలా వైసీపీ ప్రభుత్వం ఆలిని పూర్తిగా పక్కన పెట్టిందన్న వాదన వినిపించడమే కాకుండా అలీ త్వరలోనే పార్టీ మారుతున్నారని వార్తలు కూడా వచ్చాయి. అయితే ఈ వార్తలను పూర్తిగా ఖండించి ఏ పార్టీ మారడం లేదని తేల్చి చెప్పారు. ఇకపోతే వైసిపి పార్టీలోనే కొనసాగుతున్న అలికి తాజాగా ఏపీ ప్రభుత్వం శుభవార్తను తెలియజేసింది.
రెండు సంవత్సరాల పాటు అధికారంలో ఉండే ఈ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారుడిగా ఆలీని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ రెండేళ్ల పాటు ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారునిగా అలీ కొనసాగుతారని ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడంతో ఎంతోమంది అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.ఈ క్రమంలోనే మరి కొంతమంది వైసీపీ అభిమానులు ఈ విషయంపై స్పందిస్తూ కామెంట్లు చేస్తున్నారు.
జగనన్నను నమ్ముకున్న వారికి ఆయన ఏదో విధంగా న్యాయం చేస్తారని ఎవరికీ ఎలాంటి అన్యాయం చేయారని కామెంట్లు చేస్తున్నారు.అదేవిధంగా మరికొందరికి అవకాశాలు కల్పించిన ఆ అవకాశాలను సద్వినియోగం చేసుకోవడం రాదు అంటూ పరోక్షంగా నటుడు పృథ్విరాజ్ గురించి కూడా కామెంట్లు చేస్తున్నారు.ఇలా అలికి ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారునిగా బాధ్యతలు ఇవ్వడంతో ఆలీ కుటుంబ సభ్యుల సైతం ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…