Janhvi Kapoor: శ్రీదేవి కుమార్తెగా ఇండస్ట్రీలోకి పరిచయమయ్యారు నటి జాన్వీ కపూర్. ఈమె ధడక్ సినిమా ద్వారా బాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయమై వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు. ఇకపోతే తాజాగా ఈమె నటించిన మిల్లి సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సినిమా నవంబర్ 4వ తేదీ విడుదల కానున్న నేపథ్యంలో జాన్వీ కపూర్ పెద్ద ఎత్తున సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో పాల్గొన్నారు.
ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి ఈమెకు యాంకర్ నుంచి ఒక ఆసక్తికరమైన ప్రశ్న ఎదురైంది.మీకు కనుక స్వయంవరం జరిగితే ఆ స్వయంవరంలో ఏ హీరోలు ఉండాలని కోరుకుంటారనీ అడిగారు. ఈ ప్రశ్నకు జాన్వీ సమాధానం చెబుతూ హృతిక్ రోషన్, రణబీర్ కపూర్, టైగర్ అంటూ సమాధానం చెప్పారు. ఈ క్రమంలోనే యాంకర్ విజయ్ దేవరకొండ అంటూ ఆయన పేరు చెప్పారు.
ఇలా విజయ్ దేవరకొండ గురించి యాంకర్ అడగడంతో
జాన్వీ కపూర్ అతనికి ప్రాక్టికల్ గా ఎప్పుడో పెళ్లయిపోయింది అంటూ ఈమె షాకింగ్ సమాధానం చెప్పారు. ఇలా జాన్వీ సమాధానం చెప్పడం వెనుక ఒక కారణం ఉందనే వార్తలు పెద్ద ఎత్తున వినపడుతున్నాయి.గతంలో ఓ కార్యక్రమంలో పాల్గొన్న జాన్వీ కపూర్ విజయ్ దేవరకొండ రష్మికతో రిలేషన్ లో ఉన్నారంటూ చెప్పడం గమనార్హం.
ఈ క్రమంలోనే రష్మిక విజయ్ దేవరకొండ రిలేషన్ లో ఉన్నారనే ఉద్దేశంలోనే ఈమె ఇలాంటి సమాధానం చెప్పి ఉంటారని పలువురు భావిస్తున్నారు. వీరిద్దరూ రిలేషన్ లో ఉన్నారని మరోసారి ఈమె కన్ఫామ్ చేస్తూ విజయ్ దేవరకొండకు పెళ్లి జరిగిందంటూ ఈమె కామెంట్స్ చేశారు. ప్రస్తుతం ఈ కామెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ప్రకృతిలో జరిగే కొన్ని ఖగోళ అద్భుతాలు మన కళ్లకు నేరుగా కనిపించకపోయినా వాటి ప్రభావాన్ని మాత్రం మనం స్పష్టంగా అనుభవిస్తాం.…
చిన్న వయసులో ఆరోగ్యం గురించి పెద్దగా ఆలోచించని వారు చాలా మంది ఉంటారు. "ఇప్పుడేం కాదు.. తర్వాత చూసుకుందాం", "ఇంకా…
ఈ రోజుల్లో డబ్బు లేకుండా ఏ పని జరగని పరిస్థితి. ఉదయం ఇంటి నుంచి బయటకు అడుగు పెట్టిన దగ్గర…
మన తెలుగు వంటింట్లో కరివేపాకుకు ప్రత్యేక స్థానం ఉంది. పప్పు నుంచి పులుసు వరకు, చట్నీ నుంచి ఫ్రై వరకు…
హైదరాబాద్, జూన్ 20: నిర్మొహమాటంగా నికార్సుగా చెప్పాల్సి వస్తే తెలుగు రాష్ట్రాల్లో నిస్వార్ధ సేవకు నిలువెత్తు అక్షరంగా ప్రతిభతో, ప్రజ్ఞతో,…
వంట చేయడం ఒక కళ. అందులో రుచి రావాలంటే ఉప్పు, కారం, మసాలాలు అన్నీ సరైన మోతాదులో ఉండాలి. అయితే…