Pratyusha: ప్రముఖ నటి ప్రత్యూష తెలుగు చిత్ర పరిశ్రమలో చేసినది తక్కువ సినిమాలే అయినా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు.ఇలా తక్కువ సినిమాలలో నటించి ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న ప్రత్యూష మరణం ఎంతో మంది అభిమానులను కృంగదీసింది. ఈ క్రమంలోనే ఆమె మరణం గురించి తరచూ ఏదో ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంది. ఇకపోతే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న తన తల్లి తన ప్రత్యూషమరణం తరువాత పోస్ట్ మార్టం రిపోర్ట్ లో బయటపడిన నిజాలను ఈ ఇంటర్వ్యూ సందర్భంగా తెలిపారు.
ప్రత్యూష చనిపోవడానికి ముందు తను బ్యూటీ పార్లర్ కు వెళ్తానని చెప్పి వెళ్ళింది.అయితే రాత్రి 8 గంటల సమయంలో ఒక తెలియని వ్యక్తి నుంచి తనకు ఫోన్ వచ్చి ప్రత్యూషను కేర్ హాస్పిటల్లో ఒక వ్యక్తి స్ట్రేక్చర్ పై తోసుకుంటూ వెళ్లడం నేను చూశాను అక్కడ ప్రత్యూషనే ఉన్నారు ఒకసారి ఎంక్వైరీ చేయండి అంటూ తనకు ఫోన్ వచ్చిందని ఈమె తెలిపారు.ప్రత్యూష కేర్ హాస్పిటల్లో ఉండడం ఏంటి తను బ్యూటీ పార్లర్ కి వెళ్లిందని నేను అతనితో చెప్పక ఒకసారి ఎంక్వయిరీ చేయండి అంటూ అతను ఫోన్ పెట్టేశారు.
ఇలా ఆ వ్యక్తి ఫోన్ చేసిన అరగంటకే కేర్ హాస్పిటల్ నుంచి ప్రత్యూష పాయిజన్ తీసుకొని సూసైడ్ అటెంప్ట్ చేసింది అంటూ తనకు ఫోన్ వచ్చిందనీ ప్రత్యూష తల్లి తెలిపారు.హడావిడిగా తన బాబుని తీసుకొని కేర్ హాస్పిటల్ కి వెళ్ళగా ట్రీట్మెంట్ జరుగుతుందని చెప్పిన డాక్టర్లు 11:35 కు తన కూతురు చనిపోయారని చెప్పారు.ఇలా తన కూతురు చనిపోయిందని చెప్పగానే తన కమ్మలు రింగ్ చైన్ అన్ని కూడా తన చేతికి ఇచ్చారు. కానీ తన దుస్తులు మాత్రం ఇవ్వలేదంటూ తన తల్లి ఆవేదన చెందారు.
ఇలా పాయిజన్ తీసుకుని తన కూతురు మరణించింది అని కేర్ హాస్పిటల్ వైద్యులు చెప్పారు కానీ తన పోస్టుమార్టం కోసం గాంధీ హాస్పిటల్ కు తీసుకెళ్లారని, అక్కడ సిబ్బందిని అడిగి చివరిసారిగా తన కూతురు డెడ్ బాడీ చూడగా ఆమె మెడ కింద భాగంలో గాయాలు ఉన్నాయని సరోజినీ దేవి ఎమోషనల్ అయ్యారు. అదేవిధంగా తన తొడలపై కూడా స్పర్మ్ అంతా ఉందని ఆమె ఆవేదన చెందారు.పోస్టుమార్టం రిపోర్ట్ లో కూడా అదే వచ్చిందని తన కూతురిని రేప్ చేసి తన నోట్లో పాయిజన్ వేసి ఇది సూసైడ్ గా చిత్రీకరించారంటూ ఈ సందర్భంగా ఈమె ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…