Ali Daughter: తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి బాల నటుడిగా ఎంట్రీ ఇచ్చి అనంతరం కమెడియన్ గా వందల సినిమాలలో నటిస్తూ నటుడిగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు కమెడియన్ అలీ. ప్రస్తుతం ఈయన సినిమాలకు కాస్త దూరమైనప్పటికీ నిర్మాత గాను వ్యవహరిస్తున్నారు. అదేవిధంగా బుల్లితెరపై ప్రసారమవుతున్నటువంటి ఆలీతో సరదాగా కార్యక్రమానికి వ్యాఖ్యాతగా కూడా వ్యవహరిస్తున్నారు.
ఈ విధంగా తన కెరియర్ లో ఎంతో బిజీగా ఉన్నటువంటి ఆలీ ఏపీ రాష్ట్ర రాజకీయాలలో కూడా చురుగ్గా ఉంటున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఏపీ ప్రభుత్వం ఈయనని ఏపీ ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారునిగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇలా వృత్తిపరమైన జీవితంలో ఆలీ ఎంతో బిజీగా గడుపుతున్నారని చెప్పాలి.
ఇక అలీ కుమార్తె ఫాతిమాకు ఆగస్టు నెలలో హైదరాబాదులో ఎంతో ఘనంగా నిశ్చితార్థం జరిపిన సంగతి మనకు తెలిసిందే. ఈ విధంగా తన కుమార్తె నిశ్చితార్థపు ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి..ఇకపోతే తాజాగా అలీ ఇంట పెళ్లి వేడుకలు మొదలైనట్టు తెలుస్తుంది. ఈ క్రమంలోనే మొదటగా తన కుమార్తె హల్దీ వేడుకలను ప్రారంభించడంతో పెద్ద ఎత్తున కుటుంబ సభ్యులు బంధుమిత్రులు ఈ హల్దీ వేడుకకు హాజరైనట్టు తెలుస్తోంది.
ఈ హల్ది వేడుకలలో భాగంగా ఫాతిమా ఎంతో అందంగా మెరిసిపోతూ ఉన్నారు.ఇలా హల్దీ వేడుకలలో భాగంగా అలీ కుటుంబ సభ్యులు బంధువులు పెద్ద ఎత్తున సందడి చేస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.ఇక త్వరలోనే అలీ కుమార్తె వివాహాన్ని ఎంతో ఘనంగా నిర్వహించనున్నారు. ఈ వివాహానికి ఇటు సినీ ప్రముఖులతో పాటు,రాజకీయ నాయకులు కూడా పెద్ద ఎత్తున హాజరుకానున్నట్లు సమాచారం. ఇక ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని కూడా అలీ దంపతులు మర్యాదపూర్వకంగా కలిసి తమ కుమార్తె పెళ్లికి ఆహ్వానించిన సంగతి తెలిసిందే.
సినిమాల్లో కనిపించే గ్లామర్ వెనుక ఎంత కష్టముంటుందో మరోసారి నిరూపించారు బాలీవుడ్ స్టార్ కృతి సనన్. తాజాగా ఆమె నటిస్తున్న…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆరోగ్యం కోసం అభిమానులు, పార్టీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.…
టాలీవుడ్‌లో తన ప్రత్యేక శైలితో గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు-నటుడు తరుణ్ భాస్కర్ మరోసారి వినూత్న ప్రమోషన్‌తో వార్తల్లో నిలిచారు. కొత్త…
కేరళ రాష్ట్రంలో ఘోర విషాదం చోటుచేసుకుంది. త్రిస్సూర్ జిల్లాలో బాణాసంచా తయారీ కేంద్రంలో జరిగిన భారీ పేలుడు ప్రాణనష్టం కలిగించింది.…
హైదరాబాద్ నగరంలో మరో సంచలన ఘటన వెలుగులోకి వచ్చింది. సాఫ్ట్‌వేర్ రంగంలో పనిచేసిన ఒక వ్యక్తి, గంజాయి అలవాటుతో విచిత్ర…
తెలుగు సినీ పరిశ్రమలో తన ప్రత్యేక నటనతో గుర్తింపు తెచ్చుకున్న నటుడు అజయ్ ఘోష్, ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా…