Ali-Pawan Kalyan :తెలుగు సినిమా ఇండస్ట్రీలో కమెడియన్ అలీకి పవన్ కళ్యాణ్ కు మధ్య ఎలాంటి అనుబంధం ఉందో మనందరికీ తెలిసిందే.వీరి మధ్య ఎంతో మంచి స్నేహబంధం ఉండేది ఎంతగా అంటే పవన్ కళ్యాణ్ ప్రతి ఒక్క సినిమాలోని ఆలీ కోసం ఒక పాత్రను సృష్టించేవారు. అంతగా వీరిద్దరి మధ్య అనుబంధం ఉంది.ఎలాంటి అనుబంధమైన రాజకీయాలలోకి వస్తే ఆ బంధం చెడిపోతుందనేది వాస్తవమని అందరికీ తెలిసిన సత్యం.
ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని స్థాపించగా అలీ మాత్రం ఆయనకు మద్దతు తెలుపకుండా వైసీపీ పార్టీకి తన మద్దతును తెలిపారు. ఈ క్రమంలోనే వీరిద్దరి మధ్య భేదాభిప్రాయాలు వచ్చాయని వార్తలు ఓ రేంజ్ లో వైరల్ అయ్యాయి.ఈ క్రమంలోనే అలీ కుమార్తె వివాహానికి పవన్ కళ్యాణ్ రాకపోవడం ఈ వార్తలకు మరింత బలం చేకూర్చింది. అయితే పవన్ కళ్యాణ్ ఎందుకు పెళ్ళికి రాలేకపోయారో ఆలీ స్పష్టత ఇచ్చారు.
ఇక తాజాగా ఆలీతో సరదాగా కార్యక్రమం ముగియనున్న నేపథ్యంలో ఈ కార్యక్రమానికి అతిథిగా రావడం అలిని సుమ ప్రశ్నించడం జరిగింది. ఈ క్రమంలోనే సుమ అలిని ప్రశ్నిస్తూ మీకు పవన్ కళ్యాణ్ గారికి గ్యాప్ రావడానికి గల కారణం ఏంటి అనీ ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు అలీ సమాధానం చెబుతూ నాకు పవన్ కళ్యాణ్ కి ఎలాంటి గ్యాప్ రాలేదని కొందరు గ్యాప్ సృష్టించారని చెప్పుకొచ్చారు.
తన కుమార్తె వివాహానికి పవన్ కళ్యాణ్ ను పిలవడానికి షూటింగ్ లొకేషన్లోకి వెళ్లాను అదే సమయంలో పవన్ కళ్యాణ్ గారిని కలవడానికి మరికొందరు వచ్చారు. అయితే పవన్ వాళ్లని వెయిట్ చేయమని చెప్పి నాతో సుమారు 15 నిమిషాల పాటు మాట్లాడారు.తను నాతో ఏం మాట్లాడారనే విషయం ఎవరికీ తెలియదు. అందుకే ఒక వెబ్సైట్ వాళ్లు ఇదే అదునుగా భావించి వారికి మంచి పేరు వస్తుందన్న ఉద్దేశంతో మా ఇద్దరి మధ్య ఇలాంటి గ్యాప్ క్రియేట్ చేశారని అంతకుమించి మా మధ్య ఏ విధమైనటువంటి భేదాభిప్రాయాలు లేవని ఈ సందర్భంగా క్లారిటీ ఇచ్చారు.
హైదరాబాద్ ఫిబ్రవరి 19: దైవబలం ఎలా ఉంటుందో మన కన్నుల ముందు ప్రముఖ రచయిత పురాణపండ శ్రీనివాస్ జీవనంలోని పరీక్షలూ,…
2026లో తొలి చంద్రగ్రహణం త్వరలోనే సంభవించనుంది. ఈసారి హోలీ పండుగ రోజునే గ్రహణం పడనున్నట్లు ఖగోళ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. జ్యోతిష్య…
“మేడి పండు చూడు మేలిమైనుండు… పొట్ట విప్పి చూడు పురుగులండు” అనే పద్యం మనందరికీ చిన్నప్పటి నుంచే పరిచయం. బయటకు…
తెలంగాణ రాజకీయాల్లో కొత్త సమీకరణాలకు రంగం సిద్ధమవుతోంది. కల్వకుంట్ల కవిత తాజాగా చేసిన ప్రకటనలు రాష్ట్ర రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా…
తెలంగాణలో విమానయాన రంగం క్రమంగా విస్తరిస్తోంది. ఇప్పటికే రాష్ట్రానికి ప్రధాన గేట్వేగా నిలిచిన Rajiv Gandhi International Airport ద్వారా…
నెలసరి సమయంలో చాలా మంది మహిళలు కడుపు నొప్పి, నడుం నొప్పి, అలసట వంటి సమస్యలను ఎదుర్కొంటుంటారు. కొందరికి ఈ…