Ali : మహేష్ బాబు వదులుకున్న సినిమానే నన్ను హీరోని చేసింది… పదివేలిచ్చి నువ్వే హీరో అంటే నమ్మలేకపోయాను. : ఆలీ

ఒకసారి రాజమండ్రిలో ప్రెసిడెంట్ పేరమ్మ చిత్రీకరణ జరుగుతోంది. అక్కడ చిత్రబృందానికి వినోదం పంచడానికి వచ్చిన అలీని చూసి దర్శకుడు కె. విశ్వనాథ్ ఆ సినిమాలో బాలనటుడిగా అవకాశం ఇచ్చాడు.ఆ తర్వాత సినిమా రంగంలో ఎలా నెగ్గుకోచ్చాడో ఆయన మాటల్లోనే విందాం.

ఒక టీవీ కార్యక్రమంలో ఆలీ మాట్లాడుతూ.. మద్రాస్ లో సినిమా అవకాశాల కోసం ప్రయత్నిస్తున్న క్రమంలో.. అడపాదడపా సినిమా అవకాశాలు వచ్చేవి. అప్పుడు నెలకు సరిపడా భోజనం చేయాలంటే మంత్ లీ కార్డ్ 700 రూపాయలు చెల్లించి తీసుకోవాలి. సినిమా చేస్తే వచ్చిన డబ్బుల్లో 200 రూపాయలు ఇంటికి పంపించి మిగతా డబ్బులతో మెస్ కార్డ్ తీసుకునేది. ఒక్కోసారి రెండు కూడా తీసుకోవడం జరిగింది.ఎందుకంటే సినిమా వేషాలు ఎప్పుడు వస్తాయో.. ఎప్పుడు పోతాయో తెలియదు. ఆ క్రమంలో ముందు జాగ్రత్త కోసం అలా చేసేవాణ్ణి. ఇక 13 ఏళ్లు వచ్చాయంటే బాల నటుడిగా వేషాలు రావు. అలా చాలా గ్యాప్ తర్వాత ప్రేమఖైదీ చిత్రంలో అవకాశం వచ్చింది. ఒకసారి ఎస్ వి కృష్ణారెడ్డి ఓ కథను రాసుకున్నారు.

ఆ కథ చెప్పడానికి.. చెన్నై టు హైదరాబాద్ వెళ్లే ఫ్లైట్ లో హీరో కృష్ణ, ఎస్.వి.కృష్ణారెడ్డి ఎక్కారు. చెన్నైలో దిగిన తర్వాత కథ బాగుంది కానీ మహేష్ బాబు ను ఇంకో రెండు సంవత్సరాల తర్వాత వెండితెరకు పరిచయం చేద్దామని హీరో కృష్ణ అన్నారు. అలా మహేష్ బాబుతో చేసే సినిమా ఆగిపోయింది. ‘మాయలోడు’ చిత్రం విజయోత్సవ సభలో స్టేజిపై ఆ సినిమాలోని ‘చినుకు చినుకు అందెలతో… అనే పాటకి నేను డాన్స్ చేశాను. అది చూసిన ఎస్వి కృష్ణారెడ్డి, అచ్చిరెడ్డి వారిద్దరు తీయబోయే కొత్త సినిమాలో హీరో నేనేనని నిర్ణయించుకున్నారు. అలా ఒకరోజు వాళ్ళ ఆఫీస్ కి పిలిపిస్తే వెళ్లాను. అక్కడ దర్శక నిర్మాతలు నన్ను నువ్వే ‘యమస్పీడ్’ సినిమాకి హీరో అని 10000 రూపాయల చెక్కిచ్చారు. నన్ను హీరో అనేసరికి నేను నమ్మలేకపోయాను. ఊరుకోండి సార్ జోక్ చేయకండని నేనన్నాను.లేదు అలీ నువ్వే ఈ సినిమాలో హీరో అని అన్నారు. నేను ఆ ఆనందాన్ని తట్టుకోలేక పోయాను. యమస్పీడ్ కాస్త యమలీలగా మారి బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించిందని ఆ ఇంటర్వ్యూలో ఆలీ చెప్పుకొచ్చారు.