Categories: FeaturedMovie News

Flash Back : ‘రాయుడు’ అనే టైటిల్ తో వచ్చిన ఈ మూడు సినిమాల్లో ఒకటి మాత్రం అలా ఆడాల్సి వచ్చింది.

Flash Back : 1990 దశకంలో రాయుడు అనే టైటిల్ తో వచ్చిన ఈ మూడు సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద ఈ విధంగా ప్రదర్శింపబడ్డాయి…

“చినరాయుడు” 1992లో విడుదలైన తెలుగు సినిమా. బి.గోపాల్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో వెంకటేష్, విజయశాంతి ప్రధానపాత్రలు పోషించారు. ఇది తమిళంలో విజయవంతమైన చిన్న గౌండర్ సినిమాకి తెలుగు పునర్నిర్మాణం. తమిళంలో విజయకాంత్ ప్రధాన పాత్రను పోషించాడు.

కర్తవ్యం సినిమా మంచి విజయాన్ని సాధించడంతో.. విజయశాంతి ఆ తర్వాత లేడీ ఓరియంటెడ్ సినిమాలలో ఎక్కువగా నటించింది. “మగరాయుడు” 1994లో విడుదలైన తెలుగు చలనచిత్రం. అంబు లక్ష్మి ఫిల్మ్స్ పతాకంపై ముళ్ళపూడి రాంబాబు, దుగ్గినేని వెంకట్, కోవై మణి నిర్మాణ సారథ్యంలో ఇ.వి.వి.సత్యనారాయణ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కార్తీక్, విజయశాంతి నటించగా, రాజ్ – కోటి సంగీతం అందించాడు.

1994 లో శరత్ కుమార్ కథానాయకుడిగా తమిళంలో వచ్చిన నట్టమై మంచి విజయాన్ని సాధించింది. రజనీకాంత్ ఆ సినిమాను చూసి మోహన్ బాబుకు ఫోన్ చేసి “నట్టమై” చిత్రాన్ని చూడమన్నాడు.ఈ కథను తెలుగులో తెరకెక్కిస్తే మంచి విజయాన్ని సాధిస్తుందని తన అభిప్రాయాన్ని చెప్పాడు. మోహన్ బాబు వెంటనే ఆ చిత్రానికి హక్కులు కొనుగోలు చేశాడు.

పెదరాయుడు రవిరాజా పినిశెట్టి దర్శకత్వంలో 1995లో విడుదలైన ఒక సినిమా. ఇందులో మోహన్ బాబు, సౌందర్య, భానుప్రియ ప్రధాన పాత్రలు పోషించారు. ఇది నట్టమై అనే విజయవంతమైన తమిళ సినిమాకు పునర్నిర్మాణం. ఇందులో రజనీకాంత్ పాపారాయుడిగా ఒక అతిథి పాత్రలో నటించాడు. కోటి సంగీత దర్శకత్వం వహించిన ఈ సినిమాలో పాటలు ప్రజాదరణ పొందాయి.

విజయశాంతి లీడ్ రోల్ లో కనిపించిన “మగరాయుడు” చిత్రం విజయం సాధించగా.. మోహన్ బాబు హీరోగా నటించిన “పెదరాయుడు” సినిమా ఇండస్ట్రీ హిట్టుగా నిలిచింది. వెంకటేష్ హీరోగా వచ్చిన “చినరాయుడు” చిత్రం బాక్సాఫీస్ వద్ద పరాజయం పొందింది.

Lavanya Suresh

Lavanya Suresh is Senior News Reporter in Telugudesk.net. Lavanya Suresh covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

1 month ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

3 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

3 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

4 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

4 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

4 months ago