Flash Back : 1990 దశకంలో రాయుడు అనే టైటిల్ తో వచ్చిన ఈ మూడు సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద ఈ విధంగా ప్రదర్శింపబడ్డాయి…

“చినరాయుడు” 1992లో విడుదలైన తెలుగు సినిమా. బి.గోపాల్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో వెంకటేష్, విజయశాంతి ప్రధానపాత్రలు పోషించారు. ఇది తమిళంలో విజయవంతమైన చిన్న గౌండర్ సినిమాకి తెలుగు పునర్నిర్మాణం. తమిళంలో విజయకాంత్ ప్రధాన పాత్రను పోషించాడు.

కర్తవ్యం సినిమా మంచి విజయాన్ని సాధించడంతో.. విజయశాంతి ఆ తర్వాత లేడీ ఓరియంటెడ్ సినిమాలలో ఎక్కువగా నటించింది. “మగరాయుడు” 1994లో విడుదలైన తెలుగు చలనచిత్రం. అంబు లక్ష్మి ఫిల్మ్స్ పతాకంపై ముళ్ళపూడి రాంబాబు, దుగ్గినేని వెంకట్, కోవై మణి నిర్మాణ సారథ్యంలో ఇ.వి.వి.సత్యనారాయణ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కార్తీక్, విజయశాంతి నటించగా, రాజ్ – కోటి సంగీతం అందించాడు.

1994 లో శరత్ కుమార్ కథానాయకుడిగా తమిళంలో వచ్చిన నట్టమై మంచి విజయాన్ని సాధించింది. రజనీకాంత్ ఆ సినిమాను చూసి మోహన్ బాబుకు ఫోన్ చేసి “నట్టమై” చిత్రాన్ని చూడమన్నాడు.ఈ కథను తెలుగులో తెరకెక్కిస్తే మంచి విజయాన్ని సాధిస్తుందని తన అభిప్రాయాన్ని చెప్పాడు. మోహన్ బాబు వెంటనే ఆ చిత్రానికి హక్కులు కొనుగోలు చేశాడు.

పెదరాయుడు రవిరాజా పినిశెట్టి దర్శకత్వంలో 1995లో విడుదలైన ఒక సినిమా. ఇందులో మోహన్ బాబు, సౌందర్య, భానుప్రియ ప్రధాన పాత్రలు పోషించారు. ఇది నట్టమై అనే విజయవంతమైన తమిళ సినిమాకు పునర్నిర్మాణం. ఇందులో రజనీకాంత్ పాపారాయుడిగా ఒక అతిథి పాత్రలో నటించాడు. కోటి సంగీత దర్శకత్వం వహించిన ఈ సినిమాలో పాటలు ప్రజాదరణ పొందాయి.
విజయశాంతి లీడ్ రోల్ లో కనిపించిన “మగరాయుడు” చిత్రం విజయం సాధించగా.. మోహన్ బాబు హీరోగా నటించిన “పెదరాయుడు” సినిమా ఇండస్ట్రీ హిట్టుగా నిలిచింది. వెంకటేష్ హీరోగా వచ్చిన “చినరాయుడు” చిత్రం బాక్సాఫీస్ వద్ద పరాజయం పొందింది.



























