Vj Sunny: సన్నీకి ఐ లవ్ యూ చెప్పి రణబీర్ ను పెళ్లి చేసుకున్న అలియా… బాధతో సన్నీ పోస్ట్!
Vj Sunny: బాలీవుడ్ ప్రేమపక్షులు రణబీర్ అలియా గత కొన్ని సంవత్సరాల నుంచి ప్రేమలో విహరిస్తూ ఎట్టకేలకు ఏప్రిల్ 14 వ తేదీ బాంద్రాలోని రణబీర్ కపూర్ నివాసమైన ‘వాస్తు’లో మూడు ముళ్ళ బంధంతో ఒక్కటయ్యారు. ఇక ఈ వివాహానికి కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు.
ఎంతో అంగరంగ వైభవంగా జరిగిన వీరి వివాహానికి సంబంధించిన ఒక్క ఫోటో, వీడియో కూడా బయటకు రాకుండా ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నారు. మూడు ముళ్ళు పడిన అనంతరం నూతన దంపతులు మీడియా ముందుకు రావడంతో వీరి పెళ్లికి సంబంధించిన ఫోటోలు వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
ఈ క్రమంలోనే ఎంతోమంది సోషల్ మీడియా వేదికగా వీరి పెళ్లి ఫోటోలను షేర్ చేస్తూ ఈ జంటకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఇదిలా ఉండగా బిగ్ బాస్ సీజన్ ఫైవ్ తెలుగు విన్నర్ సన్నీ కూడా అలియా రణబీర్ దంపతులకు శుభాకాంక్షలు తెలియజేశారు. అయితే చాలా ఫన్నీగా శుభాకాంక్షలు తెలుపుతూ సన్నీ చేసిన పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
సన్నీ జర్నలిస్టుగా పని చేస్తున్న సమయంలోనే అలియా కు పెద్ద అభిమానిగా మారిపోయాడు. ఈ క్రమంలోనే ఓసారి అలియాను కలిసిన ఈయన బాలకృష్ణ చెప్పిన దబిడి దిబిడి డైలాగ్ తనకు నేర్పించారు. అలాగే బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే ఈరోజు అలియా బట్ బిగ్ బాస్ వేదిక పై సందడి చేస్తూ సన్నీ నేర్పించిన బాలకృష్ణ డైలాగ్ చెప్పడమే కాకుండా సన్నీకి ఐ లవ్ యు కూడా చెప్పారు. ఇలా తన అభిమాన హీరోయిన్ తనకు ఐ లవ్ యు చెప్పడంతో మనోడి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.ఇలా తనకు ఐ లవ్ యు చెప్పి రణబీర్ ను పెళ్లి చేసుకున్న తర్వాత సన్నీ సోషల్ మీడియా వేదికగా వీరి పెళ్లి ఫోటోని షేర్ చేస్తూ…పోస్ట్ లో బై ఇంక వెళ్లొస్తా అనే గిఫ్ ఒకటి జత చేశాడు. సన్నీ ఇలా పోస్ట్ చేయడంతో సన్నీ లవ్ పోయిందంటూ నెటిజన్స్ ఫన్నీగా కామెంట్లు చేస్తున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…