ఒకే టైటిల్ తో తండ్రి కొడుకుల చిత్రాలు వచ్చినా సందర్భాలు ఉన్నాయి.కానీ ఒకే కథతో తండ్రి కొడుకుల చిత్రాలు రావడం బహుశా చరిత్రలో ఇదే మొదటిసారి కావచ్చు.
2015 మైత్రి మూవీ మేకర్స్,కొరటాల శివ దర్శకత్వంలో “శ్రీమంతుడు” చిత్రం విడుదల అయ్యింది. ఈ సినిమాలో మహేష్ బాబు, శృతి హాసన్ హీరో హీరోయిన్లుగా నటించారు. ఆగర్భ శ్రీమంతుడు మహేష్ బాబు ఊరి కోసం తన ప్రేమను, కోట్ల రూపాయల ఆస్తిని కాదనుకొని ఉత్తరాంధ్రలోని దేవరకోట ఊరిని దత్తత తీసుకొని ఆ గ్రామంలో నివసిస్తున్న ఎంపి సోదరుడు చేసే అక్రమాలను అడ్డుకుంటారు.
పల్లె కోసం ప్రతికూల పరిస్థితులలో సైతం మహేష్ బాబు కృషిచేస్తాడు. ఒకసారి అవినీతి మూకల హత్యాప్రయత్నం నుండి మహేష్ బాబు బయట పడతాడు. చివరికి ఊరును అభివృద్ధి చేసి తన లక్ష్యాన్ని చేరుకుంటాడు. కోట్లరూపాయల వ్యాపారం పక్కన పెట్టి, గ్రామ క్షేమం కోసం మహేష్ బాబు పాటుపడడంతో శృతిహాసన్ ఇంకా ఆయనను ప్రేమిస్తుంది. అలా చివరికి ఊరికి అన్యాయం చేసే ఎంపి సోదరులను కడతేర్చి మహేష్ బాబు పల్లెకు న్యాయం చేస్తాడు.
దేవిశ్రీ సంగీత సారధ్యంలో వచ్చిన పోరా శ్రీమంతుడా పో.పో.. పోరా శ్రీమంతుడా.. అనే పాట సినిమాకి హైలెట్ గా చెప్పవచ్చు. కమర్షియల్ హంగులతో సందేశాత్మకంగా వచ్చిన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఈ సినిమా ప్రభావంతో గ్రామాలను దత్తత తీసుకోవడం అనే అంశం బహుళ ప్రజాదరణ పొందింది.
దాదాపుగా ఇలాంటి కథతో సూపర్ స్టార్ కృష్ణ కూడా ఒక చిత్రంలో నటించడం జరిగింది.
“అమాయకుడు కాదు అసాధ్యుడు” చిత్రం తర్వాత 1983 రాజలక్ష్మి ఆర్ట్ పిక్చర్స్, మిద్దె రామారావు నిర్మాణం, ఏ కోదండరామిరెడ్డి దర్శకత్వంలో “రామరాజ్యంలో భీమరాజు” చిత్రం విడుదలైంది. ఈ సినిమాలో కృష్ణ, శ్రీదేవి హీరో, హీరోయిన్లుగా నటించారు. కథలోకి వెళితే లంకానగరం అనే గ్రామంలో రామరాజు అనే ఒక పెద్దమనిషి ఉంటారు. కర్షకుల, కార్మికులను పీడిస్తూ తన పబ్బం గడుపుకుంటుంటాడు. ఊరి పెద్దగా చలామణి అవుతూ గ్రామస్తుల మీద అజమాయిషీ చేస్తూంటాడు. సరిగ్గా అదే సమయంలో హీరో భీమరాజు అక్కడికి చేరుకుంటాడు. రామరాజు చేసే అకృత్యాలకు తరచూ భీమరాజు అడ్డుపడుతూ ఉంటాడు.
అదే గ్రామంలో నివసిస్తున్న మరో పెద్ద మనిషి లక్ష్మీపతి ఇంట్లో రామరాజు పనివాడిగా చేరతాడు. లక్ష్మీపతి కూతురు జ్యోతి, హీరో భీమరాజు ప్రేమించుకుంటారు. అలా కొనసాగుతున్న క్రమంలో లక్ష్మీపతి కి హఠాత్తుగా 10 లక్షల లాటరీ తగలడంతో లక్షాధికారి అవుతాడు. ఆ క్రమంలో ఆయన కూతురిని డబ్బున్న వాడికి పెళ్లి చేయాలని రామరాజు కొడుకు (రాజేంద్ర ప్రసాద్)తో వివాహం నిశ్చయిస్తాడు. అది తెలుసుకున్న హీరో వివాహం జరగకుండా పెళ్లి కొడుకును కళ్యాణ మండపం నుంచి పరిగెత్తేలా చేస్తాడు.
అలా చివరికి హీరో భీమరాజు తండ్రి అక్కడికి వచ్చి తన కొడుకు భీమరాజు కోటీశ్వరుడని కోట్ల ఆస్తిని కాదని ఇక్కడికి వచ్చాడని చెప్పడంతో జ్యోతి తల్లిదండ్రులు అవాక్కువుతారు. క్లైమాక్స్ లో తనకు బలవంతంగా అంటగట్టిన రాజేంద్రప్రసాద్ పిన్నిని బంధించి హీరోయిన్ జ్యోతితో తన కొడుకు పెళ్లి చేయాలని రామరాజు(రావు గోపాలరావు)చూస్తాడు. భీమరాజు (హీరో), రామరాజు (విలన్ )కు బుద్ధి చెప్పి పోలీసులకు అప్పగిస్తాడు. చివరికి భీమరాజు, జ్యోతి మెడలో మూడుముళ్లు వేయడంతో కథ సుఖాంతమవుతుంది. ఈ విధంగా ఒకే కథతో వచ్చిన ఈ తండ్రికొడుకుల చిత్రాలు బాక్సాఫీసు వద్ద విజయ దుందుభి మోగించాయి.
తెలుగు ఇంటి వంటల్లో ఊరగాయకు ఉన్న స్థానం ప్రత్యేకం. వేడివేడి అన్నంలో ఒక ముద్ద పచ్చడి ఉంటే చాలు, భోజనానికి…
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పర్యాటకం, ఉద్యోగాలు, వ్యాపార ప్రయాణాలు విపరీతంగా పెరిగిపోయాయి. ఒక నగరం నుంచి మరో నగరానికి, ఒక దేశం…
ప్రస్తుతం ప్రభుత్వ రంగ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా…
తెలంగాణలో క్రికెట్‌కు మరింత ప్రోత్సాహం అందించే లక్ష్యంతో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న టీజీ20 లీగ్ ప్రారంభానికి సర్వం…
తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్‌గా, నటిగా సుపరిచితమైన విష్ణుప్రియ భీమినేని మరోసారి వార్తల్లో నిలిచారు. టెలివిజన్ షోలు, రియాలిటీ కార్యక్రమాలు,…
వ్యవసాయం అనేది దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక. రైతు సంతోషంగా ఉంటేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది. అయితే…