Aliya Ranbir ‘s marriage photos and video gone viral :
బ్రహ్మాస్త్ర సినిమా షూటింగ్ తో మొదలైన పరిచయం ప్రేమగా మారి ఇపుడు పెళ్లి చేసుకున్నారు బాలీవుడ్ ప్రేమ పక్షులు ఆలియా రణ్ బీర్ కపూర్.2017 లో ప్రారంభమైన వీరి పరిచయం ప్రేమగా మారి అప్పటికే అందరికి అనుమానాలు పుట్టించేసారు. ఇక 2018 నాటికీ అధికారికంగా తాము ప్రేమించుకుంటున్నట్లు మీడియకు ప్రకటించారు. ఇక వీరు 2020లోనే పెళ్లి చేసుకుంటారు అని వినిపించినా కరోనా కారణంగా పెళ్లిని ఇరు కుటుంబాలు వాయిదా వేసాయి.
అట్టహాసంగా పెళ్లి…..
ఇక ఈ ఏడాది పెళ్లి వార్తలు వినిపించినా మొదట్లో ఏప్రిల్ 10న పెళ్లి అంటూ ప్రచారం జరిగింది. అయితే ఆ తరువాత ఏప్రిల్ 14 నే పెళ్లి నిశ్చయించారు ఇరువురి కుటుంబ సభ్యులు. ఇక పెళ్లిని అత్యంత సన్నిహితుల మధ్య చాలా సింపుల్ గా ముంబై బంద్ర లోని వాస్తు అపార్ట్ మెంట్ లో జరిపారు. ఇక ఈ వేడుకలో కరిష్మా, కరీనా సందడి చేసారు. వీరి వివాహానికి సంబంధించి ఏ ఫోటోలను బయటికి వివాహం అయ్యేవరకు రానివ్వలేదు. ఇక ఆ తరువాత ఆలియా రణ్ బీర్ లు వారి సోషల్ మీడియా ఖాతాలలో ఫోటోలను అభిమానులతో పంచుకున్నారు.
ఇక నిన్న పెళ్లి జరిగినప్పటి నుండి సోషల్ మీడియా మొత్తం రణ్ బీర్ ఆలియా ల పెళ్లి ఫొటోలతో నిండిపోతోంది. ఇక రణ్ బీర్ ఆలియా ఎత్తుకుని తీసుకెళ్తున్న వేసి ఉదయం నుండి తెగ వైరల్ అయింది.ఇక ఇపుడు మరో వీడియో నెట్ లో హల్ చల్ చేస్తోంది. ఇందులో..ఆలియా, రణ్ బీర్ కు వివాహ సమయంలో వరమాల వేసేటప్పుడు రణ్ బీర్ ను కొంతమంది సన్నిహితులు ఎత్తుకుని ఆటపట్టించడం ఆ తర్వాత రణ్ బీర్ మోకాలి పై కూర్చొని ఆలియా తో వరమాల వేయించుకుని పెదవులపై ముద్దు పెట్టుకోవడంతో నెటిజన్స్ ను ఆకట్టుకుంటోంది. కొంతమంది క్యూట్ జంట అని కామెంట్ పెడితే మరికొంతమంది చాలా రొమాంటిక్ కపుల్ అంటూ, వారి ప్రేమ కనిపిస్తోందంటూ కామెంట్స్ పెడుతున్నారు. ఇక ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా షేర్ అవుతోంది.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…